Health Tips: జలుబు దగ్గుతో బాధ పడుతున్నారా? ఇదిగో హోమ్ రెమెడీస్

వర్షాకాలంలో వేధించే సీజనల్‌ సమస్యలకు బెస్ట్ నివారిణి తేనె. తేనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు కఫం నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లను తేనె చాలా ఈజీగా తొలగిస్తుంది.

Written By: Swathi, Updated On : June 14, 2024 12:49 pm

Health Tips

Follow us on

Health Tips: వచ్చేసింది వర్షాకాలం. వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, తుమ్ములు కూడా వచ్చేస్తాయి. ఇతర వ్యాధులు కూడా వస్తుంటాయి కానీ ఇవి మాత్రం చాలా మందిని ఇబ్బంది పెడతాయి. ఒకసారి ఇంట్లో ఎవరికైనా దగ్గు వస్తే.. అంత త్వరగా నయం కాదు. దీనితో పాటు ఊపిరితిత్తులలో కఫం మరింత పేరుకుంటుంది. ఒకరి నుంచి ఇంటిల్లిపాదిని వెంటాడుతుంది. మరి ఈ జలుబు, దగ్గు నుంచి త్వరగా నివారణ పొందాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా? అయితే ఓ లుక్ ఈ హోమ్ రెమెడీస్ వైపు వేయండి.

వర్షాకాలంలో వేధించే సీజనల్‌ సమస్యలకు బెస్ట్ నివారిణి తేనె. తేనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు కఫం నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లను తేనె చాలా ఈజీగా తొలగిస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల తేనె మిక్స్ చేసి తాగాలి. జలుబు, దగ్గు వంటి సమస్యలతో పాటు జ్వరం, తలనొప్పి వంటి వ్యాధులు కూడా మాయం అవుతాయి. ఉదయం, సాయంత్రం ఒక చెంచా తేనె తిన్నా కూడా మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి.

బెల్లం మాత్రమే కాదు మీకు అల్లం కూడా మంచి రెమెడీలా పని చేస్తుంది. పచ్చి అల్లం తిన్నా లేదా దాని రసం తీసి తాగినా జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. మరో నివారిణి మిరియాలు. వీటి పొడిని ఒక చెంచా తేనెలో కలుపుకుని తాగితే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు మాయం అవుతాయి. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది. కానీ, దీన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రత చాలా పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన, సోషల్ మీడియాలో ఉన్న సమాచారం మేరకు మాత్రమే అందించడం జరుగుతుంది. దీన్ని ఒకే తెలుగు నిర్ధారించదు.