Yadadri : యాదాద్రి బంగారుమయం.. చూడడానికి రెండు కళ్లు చాలవట.. కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ ఇదీ

 2025 మర్చిలోపే బంగారుమయం కానున్న విమాన గోపురం: రాబోయే బ్రహ్మోత్సవాలకి మునుపే విమానగోపురానికి బంగారు తాపడం పూర్తి చేయాలని నిర్ణయించడంతో బ్రహ్మోత్సవాలకి వచ్చే భక్తులకు ఆలయం బంగారు వర్ణంలో కనువిందు చేయనుంది. ఈ పనుల్ని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ నిర్వహిస్తుంది.

Written By: Bhaskar, Updated On : September 29, 2024 12:49 pm

Yadadri

Follow us on

Yadadri : తెలంగాణ తిరుపతి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బంగారు మయం కానుంది. ఇప్పటికే గోపురాలు, గోడలు బంగారు, వెండి తాపడాలతో ధగధగా మెరుస్తుంటే, రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి విమానగోపురానికి బంగారు తాపడం చేయాలని సంకల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, దేవాదాయ, ధర్మాదాయ శాఖమంత్రి కొండా సురేఖ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

2025 మర్చిలోపే బంగారుమయం కానున్న విమాన గోపురం: రాబోయే బ్రహ్మోత్సవాలకి మునుపే విమానగోపురానికి బంగారు తాపడం పూర్తి చేయాలని నిర్ణయించడంతో బ్రహ్మోత్సవాలకి వచ్చే భక్తులకు ఆలయం బంగారు వర్ణంలో కనువిందు చేయనుంది. ఈ పనుల్ని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ నిర్వహిస్తుంది. ఈ పనులన్నీ సవ్యంగా జరిగేలా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నిత్యం పర్యవేక్షిస్తుంది.

యాదాద్రి ఆలయానికి బంగారు ఆభరణం సమర్పించిన నిజాం వారసురాలు యువరాణి ఎస్రా : యాదాద్రి పాత ఆలయానికి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తన హయాంలో రూ.82,825 సమర్పిస్తే, నూతన ఆలయ నిర్మాణంలో ఆయన వారసురాలు, ఎనిమిదో నిజాం యువరాణి ఎస్రా రూ.8లక్షల విలువైన బంగారు ఆభరణం సమర్పించారు. తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. యాదాద్రి పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1800 కోట్లు కేటాయిస్తే, గోడలు, గోపురాలని బంగారు, వెండి తాపడం చేయడానికి భక్తులు 39 కిలోల బంగారం, 1753 మెట్రిక్ టన్నుల బంగారం సమర్పించారు.