SRH vs HCA : హెచ్ సీఏ(Hyderabad cricket association)పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ నిర్వహించాలని విజిలెన్స్ అధికారులకు సూచించారు.. ఉచిత పాస్ లకు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపిస్తోంది.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మేనేజర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ కి రాసిన లేఖ ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ” గర్జన 12 సంవత్సరాలుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో మేము కలిసి పని చేస్తున్నాం. రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేధింపులు తలెత్తుతున్నాయి. ముందస్తుగా ఉన్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు 3,900 కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తున్నాం.. ఇందులోనే 50(ఎఫ్ 12 ఏ) కార్పొరేట్ బాక్స్ టికెట్లు ఇస్తున్నాం.. కానీ ఈ సంవత్సరం “ఎఫ్ 12 ఏ ” కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లు మాత్రమే. ఫలితంగా అదనంగా మరో బాక్స్ లో 20 టికెట్లు ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మమ్మల్ని డిమాండ్ చేస్తున్నది. దీనిపై తగువిధంగా చర్చించి..ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు వెల్లడించాం. ప్రతి సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ప్రతి మ్యాచ్ కు కోటిన్నర అద్దె రూపంలో చెల్లిస్తున్నాం . అయినప్పటికీ ఎఫ్ – బాక్స్ కు గత మ్యాచ్లో తాళం వేశారు. చివరి నిమిషంలో మరో 20 టికెట్లు ఉచితంగా ఇవ్వాలని.. లేకపోతే బాక్స్ తెరిచేది లేదంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. తరచూ ఇలా చేస్తే సమన్వయ వాతావరణం దెబ్బతింటుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇలా బెదిరింపులకు పాల్పడటం తొలిసారి కాదు. గత రెండు సీజన్లలో మా సిబ్బంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లాం. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా మమ్మల్ని బెదిరించారు. జరిగిన పరిణామాలు చూస్తుంటే ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు ఆడటం హెచ్ సీఏ కు ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ అదే వారి అభిమతమైతే.. బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తాం. ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతాం. మరో వేదికను కచ్చితంగా చూసుకుంటాం. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని” సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ లేక లో ప్రస్తావించారు.
Also Read : పాసుల కోసం SRHను వేధించిన HCA: సీఎం సీరియస్ చర్యలు
రేవంత్ రెడ్డి ఎంట్రీ
ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. హెచ్ సీఏ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరపాలని ఇంటెలిజెన్స్ పోలీసులను ఆదేశించారు. ఇక ఈ లేఖ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ రాసిన లేఖ అ వాస్తవమని పేర్కొంది. సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఎటువంటి లేఖ రాలేదని వివరించింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో సన్ రైజర్స్ స్పోర్ట్స్ జనరల్ మేనేజర్ లేఖ రాసింది నిజమేనని.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదో దాస్తున్నదనే విషయం తెలుస్తోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ గొడవ ఎక్కడ దాకా దారితీస్తుందో..
Also Read :