https://oktelugu.com/

Sreetej’s father Bhargav : అల్లు అర్జున్ పై వేసిన కేసుని వెనక్కి తీసుకున్న శ్రీతేజ్ తండ్రి భార్గవ్..బన్నీ ని అన్యాయంగా టార్గెట్ చెయ్యొద్దు అంటూ వేడుకోలు!

శ్రీతేజ్ ఆరోగ్యం కూడా ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది. ఇది అల్లు అర్జున్ కి ఆయన అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. త్వరలో శ్రీతేజ్ పూర్తి స్థాయిలో కోలుకొని మామూలు స్థితికి రాబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే చనిపోయిన రేవతి భర్త, శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ అల్లు అర్జున్ కి సపోర్టు గా ఉంటున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 10:12 PM IST

    Sreetej's father Bhargav

    Follow us on

    Sreetej’s father Bhargav : డిసెంబర్ నాల్గవ తేదీన సంధ్య థియేటర్ లో పుష్ప ప్రీమియ ర్ షో సమయం లో జరిగిన దుర్ఘటన కారణంగా రేవతి అనే అమ్మాయి చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లి కిమ్స్ లో చికిత్స తీసుకుంటూ ఉండడం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం వంటి ఘటనలు ఎంతటి దుమారం రేపాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసుల విచారణని ఎదురుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే చికిత్స అందుకుంటున్న శ్రీతేజ్ ఆరోగ్యం కూడా ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది. ఇది అల్లు అర్జున్ కి ఆయన అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. త్వరలో శ్రీతేజ్ పూర్తి స్థాయిలో కోలుకొని మామూలు స్థితికి రాబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే చనిపోయిన రేవతి భర్త, శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ అల్లు అర్జున్ కి సపోర్టు గా ఉంటున్న సంగతి తెలిసిందే.

    నేడు ఆయన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి అల్లు అర్జున్ మీద వేసిన కేసు ని వెనక్కి తీసుకుంటాను అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బాబు కి ప్రమాదం జరిగినప్పుడు అల్లు అర్జున్ గారి నుండి సపోర్ట్ కావాలని కోరుకున్నాము. మాకు రెండవ రోజు నుండే ఆయన నుండి, ఆయన టీం నుండి సపోర్ట్ దొరికింది. అన్ని విధాలుగా వాళ్ళు మమ్మల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అయినప్పటికీ ఆయన మేము వేసిన కేసు వల్లే అరెస్ట్ అయ్యాడు అనే బాధతో ఆ కేసు ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడ్డాను. మా వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అనేది నాకు అసలు నచ్చలేదు. ఇది పూర్తిగా నా అభిప్రాయం మేరకే కేసుని వెనక్కి తీసుకుంటున్నాను కానీ, నా మీద ఎవ్వరూ ఒత్తిడి పెట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు భార్గవ్.

    అల్లు అర్జున్ ఇప్పటికే పాతిక లక్షల రూపాయిలను ఆ కుటుంబానికి ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ పాతిక లక్షల్లో ఇప్పటి వరకు ఆయన పది లక్షల రూపాయిలు DD అందించారట. మిగిలిన డబ్బులు త్వరలోనే ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పారంటూ భార్గవ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా పుష్ప 2 నిర్మాతలు నిన్న భార్గవ్ ని కలిసి తమ తరుపున 50 లక్షల రూపాయిల చెక్ ని అందచేసిన సంగతి తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ ఎందుకు ప్రకటించిన పాతిక లక్షలు ఒక్కేసారి ఇవ్వలేదు?, కేవలం పది లక్షలు ఎందుకు ఇచ్చినట్టు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆరా తీస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే భార్గవ్ తాను వేసిన కేసు ని వెనక్కి తీసుకుంటున్నాడు కాబట్టి, అల్లు అర్జున్ త్వరలోనే శ్రీతేజ్ ని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఈ కేసు కారణంగానే రూల్స్ ప్రకారం కలవకూడదు కాబట్టి ఇప్పటి వరకు అల్లు అర్జున్ కలవలేదు.