HomeతెలంగాణAllu arjun : అల్లు అర్జున్ ను అదృశ్య శక్తి నడిపిస్తోందా? ఈ వ్యవహారం మొత్తం...

Allu arjun : అల్లు అర్జున్ ను అదృశ్య శక్తి నడిపిస్తోందా? ఈ వ్యవహారం మొత్తం ఓ వ్యక్తి కనసన్నల్లో నడుస్తోందా?

Allu arjun : పుష్ప -2 విడుదల సందర్భంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటన ప్రమాదం కాదట.. ఈ ఘటనకు కారణమైన అల్లు అర్జున్ వెనుక ఒక అదృశ్య శక్తి ఉందట. ఆ శక్తి తన వ్యవసాయ క్షేత్రంలో ఉందట. కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఆ అదృశ్య శక్తి దూరంగా ఉంటున్నదని అందరూ అంటుకుంటున్నారని.. అయితే అదంతా తప్పట. తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఆ శక్తి తహ తహ లాడుతోందట. అందువల్లే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని చెప్పింది పాదూరి శ్రీనివాసరెడ్డి అనే హైకోర్టు లాయర్. మంగళవారం అల్లు అర్జున్ విచారణ ముగిసిన అనంతరం.. శ్రీనివాస్ రెడ్డి మైక్ అందుకున్నాడు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడాడు. తనకు స్పష్టమైన సమాచారం ఉందని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతారని.. వచ్చే వారంలో తెలంగాణ రాజకీయాలలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని ఒకప్పటి టీవీ9 శివాజీ గరుడ పురాణం లెవెల్ లో చెప్పుకొచ్చాడు.. కానీ ఇక్కడే అతడు అనేక లాజికులు మిస్ అయ్యాడు.

శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే అల్లు అర్జున్ వెనుక ఆ అదృశ్య శక్తి ఉంది అనుకుందాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడుతుంది అనుకున్నాం. అలాంటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు కదా.. అప్పుడు ఆ అదృశ్య శక్తికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించదు కదా. ఎక్కడో జెడ్పిటిసిగా మొదలుపెట్టిన తన ప్రస్థానాన్ని ముఖ్యమంత్రి వరకు రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. అలాంటప్పుడు తన పదవిని అత్యంత సులభంగా వదులుకుంటారా.. అది సాధ్యమవుతుందా.. ఇప్పటికిప్పుడు సొంత పార్టీలో రేవంత్ రెడ్డికి వచ్చిన ఇబంది లేదు. భట్టి విక్రమార్క సహకరిస్తున్నాడు. ఉత్తంకుమార్ రెడ్డి జి హుజుర్ అంటున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భుజం తడుముతున్నాడు. దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉపయోగపడుతున్నాడు.. పైగా రాహుల్ గాంధీ మొదటి నుంచి రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నాడు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు దిగిపోయే ప్రమాదం ఏముంది. సంఖ్య బలం ప్రకారం చూసుకున్నా ఇబ్బంది లేదు.. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే భారత రాష్ట్ర సమితి లో కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునే ప్రమాదం లేకపోలేదు. రేవంత్ రెడ్డికి జై కొట్టే సన్నివేశమూ ఉండకపోదు. ఎటోచ్చి ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళతోనే ఇబ్బంది. ఏదో జరిగిపోతుందని భావిస్తుంటారు.. ఏదో అయిపోతుందని చెబుతుంటారు. సంచలనం కోసం ప్రయత్నిస్తుంటారు. మీడియాకు కూడా అలాంటి వారి కావాలి కాబట్టి.. ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. రోజులు గడిస్తే అందులో విషయం లేదని తర్వాత అర్థమవుతుంది.. మొత్తంగా ఈ ఎపిసోడ్లో ఇలాంటి వాళ్లు వస్తూనే ఉంటారు. పోతూనే ఉంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version