Karimnagar: కరీంనగర్.. ఉద్యమాల పురిటిగడ్డ. పోరాటాలకు స్ఫూర్తి. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు తెలంగాణలో కరీంనగర్‌కు ప్రత్యేక స్థానం ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత కరీనంగర్ చిలువలు పలువలుగా చీలిపోయింది. ఇక కరీంనగర్ లోక్‌సభ స్థానం ఐదు జిల్లాల పరిధిలోకి వెళ్లింది. ఉమ్మడి జిల్లాలో ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉండేవి. ఇప్పుడు ఐదు జిల్లల పరిధిలోకి చేరాయి.
మూడు జిల్లాల్లోకి మూడు నియోజకవర్గాలు..
ఉమ్మడి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత మూడు నియోజకవర్గాలు మూడు జిల్లాల్లోకి వెళ్లాయి. మరో రెండు రెండు జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. ప్రస్తుతం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. గతంలో పార్టీల పరంగా ఒకే జిల్లా అధ్యక్షుడు ఉండేవారు. ప్రస్తుతం ఐదుగురు అధ్యక్షులు ఉన్నారు. అభ్యర్థులు వారందరినీ సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి.
శాసనసభ నియోజకవర్గాలు ఇలా..
సిరిసిల్ల…
నియోజకవర్గంలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడిడపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాలు ఉన్నాయి. అన్నీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉన్నాయి.
వేములవాడ…
ఈ నియోజకవర్గంలో కథాలాపూర్, మేడిపల్లి, బీమారం మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలో ఉండగా, వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి.
చొప్పదండి..
చొప్పదండి, రామడుగు, గందాధర కరీంనగర్ జిల్లాలో ఉండగా మల్యాల, కొడిమ్యాల మండలాలు జగిత్యాల జిల్లాలో, బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది.
కరీంనగర్..
కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, కరీంనగర్ అర్బన్ మండలాలు పూర్తిగా కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి.
మానకొండూర్..
మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం మండలాలు కరీనంగర్ జిల్లాలో ఉండగా ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లాలో, బెజ్జంకి సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నాయి.
హుస్నాబాద్..
హుస్నాబాద కోహెడ, అక్కన్నపేట మండలాలు సిద్ధిపేట జిల్లాలో, సైదాపూర్, చిగురుమామిడి మండలాలు కరీంనగర్ జిల్లాలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నాయి.