https://oktelugu.com/

Mini Ac: చిటికెలో ఇంటిని చల్లబరిచే మినీ ఏసీ ఇదీ.. ధర తక్కువ.. సైజ్ చిన్నది.. వెంటనే కొనేయండి

3 స్పీడ్ కంట్రోల్ తో నడిచే ఫ్యాన్ ను ఇందులో అమర్చారు. దీంతో ఇది గది అంతటా ఒక్క నిమిషంలో కూల్ చేస్తుంది. ప్రతి మూలకు గాలి వెళ్లేలా దీని స్పీడు ఉంటుంది. ఇది పనిచేయడానికి 90 వాట్ల కరెంట్ అవసరం ఉంటుంది. కానీ దీనికి కరెంట్ బిల్లు పెద్దగా రాదు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 20, 2024 / 12:46 PM IST

    Portable Ac Low Price

    Follow us on

    Mini Ac:  ఎండలు మండిపోతున్నాయి.. బయటకు వెళ్లాలంటే భయమవుతోంది.. ఈ తరుణంలో ప్రజలు చల్లదనాన్ని కోరుకుంటున్నారు. నాన్ స్టాప్ గా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను తిప్పుతున్నారు. వేసవిలో చల్లదనం కోసం సామాన్యుల నుంచి మిడిల్ క్లాస్ వరకు ఫ్యాన్ లేదా కూలర్ కొనుగోలు చేస్తుంటారు. ఏసీ కొనేంత స్థోమత ఉండదు కాబట్టి దాని జోలికి వెళ్లరు. కానీ ఇప్పుడు ఓ కంపెనీ అతి తక్కువ ధరకే మినీ ఏసీని అందిస్తోంది. ఇది ఫ్యాన్ కంటే తక్కువ ధరకే వస్తుంది. అంతేకాకుండా దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.ఇంతకీ ఇది ఏ కంపెనీ? ఇది ఎలా పనిచేస్తుంది?

    ఇంట్లో ఒక్కరు నివసించినప్పుడు, షాపుల కోసం ఫోర్టబుల్ ఏసీలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ వాటి ధరలు తక్కవేం లేవు. కానీ వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ కంపెనీ చిన్న కూలింగ్ ఫ్యాన్ తో కలిగిన మినీ ఏసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఎక్కడి కంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. అంటే బెడ్ రూం నంచి హాల్ లోకి వెళితే అక్కడ పెట్టుకోవచ్చు. బయటకు వెల్లినా కూడా తోడుగా ఉంచుకోవచ్చు.

    3 స్పీడ్ కంట్రోల్ తో నడిచే ఫ్యాన్ ను ఇందులో అమర్చారు. దీంతో ఇది గది అంతటా ఒక్క నిమిషంలో కూల్ చేస్తుంది. ప్రతి మూలకు గాలి వెళ్లేలా దీని స్పీడు ఉంటుంది. ఇది పనిచేయడానికి 90 వాట్ల కరెంట్ అవసరం ఉంటుంది. కానీ దీనికి కరెంట్ బిల్లు పెద్దగా రాదు. అంతేకాకుండా ఇది కూల్ కావడానికి ఎలాంటి వాటర్ అవసరం లేదు. ఆటోమేటిక్ కూలింగ్ సిస్టం ఇందులో ఉంటుంది. దీని ధర రూ.3,000 నిర్ణయించారు. కానీ ప్రస్తుతం 50 శాతం డిస్కౌంట్ తో విక్రయిస్తున్నారు. దీంతో దీనిని రూ.1509 కే దక్కించుకోవచ్చు.