Smita Sabharwal: స్మితాసబర్వాల్.. డ్యాసింగ్ అండ్ డేరింగ్ ఐఏఎస్‌గా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలు. ఆమె పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. అందుకే తెలంగాణ విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. స్మితా సబర్వాల్‌ను తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. ఆమెకు ప్రత్యేక అధికారాలు కూడా ఇచ్చారు. తర్వాత సీఎంవో సెక్రెటరీగా, నీటిపారుదల శాఖ కమిషనర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడ కూడా స్మితా సబర్వాల్‌కు మంచి మార్కులే పడ్డాయి. స్మితాసబర్వాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. మహిళలపై జరిగిన అఘాయిత్యాలను ఆమె బహిరంగంగానే ఖండిస్తారు. సోషల్ మీడియాలో తన ఫొటోలతో ఆకట్టుకుంటుంటారు. సీనియర్ ఐఏఎస్ అయిన స్మితా సబర్వాల్.. ఇటీవల దివ్యాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. దివ్యాంగులు ఐఏఎస్‌కు పనికిరారని ఆమో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సివిల్స్‌లో దివ్యాంగుల రిజర్వేషన్ ఎత్తేయాలని కోరారు. దీనిపై దివ్యాంగ సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వం తరఫున భట్టి, సీతక్క కూడా స్మితాసబర్వాల్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్గితమన్నారు. అయినా దివ్యాంగులు నిరసన ఆపలేదు.
హైకోర్టుల పిలిషన్..
స్మితాసబర్వాల్ దివ్యాంగులను ఉద్దేశించి ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితేం స్మితా సబర్వాల్ పై దాఖలైన పిటిషన్‌ను కొట్టి వేసింది హై కోర్టు. దీంతో ఆమెకు పెద్ద రిలీఫ్ లభించింది.
ఆమె వ్యక్తిగతమన్న కోర్టు..
తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్.. ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఎప్పుడైతే ట్వీట్ చేసిందో.. ఈ ట్వీట్ పెను సంచలనంగా మారింది. పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ వ్యాఖ్యలు పూర్తిగా స్మితాసబర్వాల్ వ్యక్తిగతమన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్గిత అభిప్రాయాలు ఉంటాయన్నారు. వాటిని తప్పుపట్టలేమని పేర్కొంది. దీంతో పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కొట్టేసింది.