Homeజాతీయ వార్తలుHigh alert in India: మళ్లీ ఉగ్రవాద దాడులు.. దేశం లో హైఅలర్ట్

High alert in India: మళ్లీ ఉగ్రవాద దాడులు.. దేశం లో హైఅలర్ట్

High alert in India: దేశంలో ఉగ్ర కార్యకలాపాలు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. వేర్వేరు ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. అయితే అన్ని ఘటనలకూ ఒకే లింక్‌ ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 6 లేదా జనవరి 26 తేదీలను లక్ష్యంగా ఉగ్రవాద విజృంభణలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌ నుంచి గుజరాత్‌ వరకు, ఢిలీ, కశ్మీర్, ఫరీదాబాద్, రాజస్థాన్‌ వంటి ప్రాంతాలలో పేలుళ్ల కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకర్తలు విడివిడిగా ఉన్నా, ఉత్తర భారతదేశంలో భారీ అగ్ని సృష్టించేందుకు సన్నాహకాలు చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి.

ఉగ్రవాద వైద్యులు..
అల్‌ ఫలా యూనివర్సిటీ పరిధిలో ఉగ్ర డాక్టర్లు ఇస్తున్న సమాచారంతో ఇంటలిజెన్స్, పోలీసులు, భద్రతాదళాలు ఉగ్ర లింకులు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారి కోసం వెతుకుతున్నారు. సారంపూర్‌లో జైష్‌ ఎ మహ్మద్‌ మహిళా విభాగాన్ని నిర్వహించే ఉగ్ర మహిళా డాక్టర్‌ పట్టుబడింది. నూహూ ప్రాంతంలో ఉగ్రులకు అవాంతరం కల్పించేవారు అడ్వకేట్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, మత బోధకులు కూడా ఉన్నారు.

పేలుడు పదార్థాలు, భయకంరమైన విషం..
గుజరాత్‌లో రిసిన్‌ అనే విష పదార్థాలను ఆహార, ప్రసాదాలపై కలిపే ప్రయత్నం జరిగింది. రాజస్థాన్‌లో నంబర్‌ ప్లేట్‌ లేకుండా అనుమానాస్పదంగా పట్టుకున్న వాహనంలో 981 జిలిటెన్‌ స్టిక్స్, 93 డిటోనేటర్స్, పీజ్‌ వైర్లు, టైమర్లు కనుగొన్నారు. అల్‌ ఫలా యూనివర్సిటీ పరిధిలో 2,900 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. ఒక ఉగ్రవాది పేలుడు పదార్థాలు తరలిస్తూ ఢిల్లీ ఎర్రకోట వద్ద పేల్చుకున్నాడు.

అంతర్జాతీయ మద్దతు..
ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ సపోర్ట్‌ చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. తుర్కీ, ఖతర్‌ వలె దేశాల పేర్లతో ఐఎస్‌ఐ హ్యాండిల్‌ చేస్తోంది. బంగ్లాదేశ్‌ మద్దతులో కూడా ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయి. అందరి లక్ష్యం డిసెంబర్‌ 6 లేదా జనవరి 26 దేశంలో విధ్వంసం సృష్టించడమే అని తెలుస్తోంది. రాజస్థాన్‌లో ఒసామా ఉమర్, ఖాసీం మౌలానా వంటివారు యువతను ఉగ్రవాద వైపు మళ్లిస్తున్నారు. మహారాష్ట్ర గ్రామాల పేర్ల మార్పు, హైదరాబాద్‌ నుంచి బిహార్‌కు పేలుడు సరుకుల రవాణా వంటి సంఘటనలు దేశంలో వివిధ చోట్ల ఉగ్రమూలాలకు ఆధారం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version