HomeతెలంగాణSBI Rayadurgam Land Auction: ఎస్బీఐ వెనక్కి తగ్గింది.. రేవంత్ రాజకీయం అట్లుంటది..

SBI Rayadurgam Land Auction: ఎస్బీఐ వెనక్కి తగ్గింది.. రేవంత్ రాజకీయం అట్లుంటది..

SBI Rayadurgam Land Auction:  రాయదుర్గం భూముల వేలానికి సంబంధించి ఎస్బిఐ కి అనుకూలంగా నమస్తే తెలంగాణ వరుసగా మూడు రోజులపాటు బ్యానర్ కథనాలను ప్రింట్ చేసింది. గట్టిగా ప్రచారం చేసింది. వాస్తవానికి నమస్తే తెలంగాణ ఈ రేంజ్ లో ప్రయారిటీ ఇవ్వడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత దీని లోతులోకి వెళ్తే అసలు కథ అర్థమైంది.

ఎస్బిఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇతడికి.. వనపర్తి లో కీలక నాయకుడికి దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో ఆ నాయకుడు అనేకసార్లు ముంబై వెళ్లారు. రాయదుర్గం భూములు వేలం వేసినప్పుడు కూడా వెళ్లారు. ఢిల్లీ స్థాయిలో ఓ నాయకుడు చక్రం తిప్పారు. ఆ తర్వాత ఎస్బిఐ మాట మార్చింది. భూముల వేలం ముందు నిశ్శబ్దంగా ఉన్న ఎస్బిఐ.. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళింది. ఈ వ్యవహారం కాస్త వివాదంగా మారింది. వాస్తవానికి 2021 లోనే ఈ భూములకు సంబంధించి భారత రాష్ట్ర సమితి ఎస్బిఐ కి కేటాయించిన భూములను రద్దు చేస్తున్న నిర్ణయం తీసుకుంది. అంత కాదు దీనికి ప్రత్యామ్నాయంగా గండిపేట ప్రాంతంలో భూమి ఇవ్వాలని కూడా భావించింది. అంతేకాదు ప్రత్యామ్నాయ భూమి కి దరఖాస్తు చేసుకోవాలని 2023లో ఎస్బిఐ కి అప్పటి ప్రభుత్వం లేఖ రాసింది.

ఇటీవల రాయదుర్గం భూములను వేలం వేసిన తర్వాత రాజకీయ పార్టీ మాదిరిగా ఎస్బిఐ వ్యవహరించింది. ప్రభుత్వం మీద ఏకంగా హైకోర్టు దాకా వెళ్ళింది. దీనిని నమస్తే తెలంగాణ పిచ్చిపిచ్చిగా రాసింది. గులాబీ పార్టీ నేతలు కూడా వీర లెవల్లో నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిన తర్వాత అసలు కథ మొదలైంది. ఎస్బిఐ వెనక రాజకీయ శక్తులు ఉన్నాయని అర్థమైంది. దీంతో ఏకంగా ఎస్బిఐ మీద రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించారు. లీడ్ బ్యాంకు హోదాను తొలగించాలని.. ప్రభుత్వ డిపాజిట్లు.. ఇతర నగదు నిల్వలు మొత్తం వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.

ఈనేపథ్యంలో ఎస్బిఐ వెనక్కి తగ్గింది. అంతేకాదు ఢిల్లీ లెవెల్ లో రేవంత్ రాజకీయం నడపడంతో తట్టుకోలేక సైలెంట్ అయిపోయింది. అంతేకాదు సిఎస్ రామకృష్ణారావుతో ఎస్బిఐ సిజిఎం భేటీ అయ్యారు. భూమికి సంబంధించి గడువు కావాలని కోరారు. కోర్టు వాయిదా ఏం నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. లీడ్ బ్యాంకు హోదాను తొలగించకూడదని విన్నవించారు. ఈ సమావేశం పూర్తికాగానే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఢిల్లీ వెళ్ళిపోయారు. నివేదికను ముఖ్యమంత్రి సమర్పించారు. దీనిపై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version