Sarpanch Navya new avatar: సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ రాజకీయాలలో సర్పంచ్ నవ్య ఒక సంచలనం. అప్పట్లో ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ఛానల్స్ వెంటపడ్డాయి. ఇక యూట్యూబ్ ఛానల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె నాటి ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితిలో కీలక నాయకుడు రాజయ్య మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తనను ఇబ్బంది పెట్టాడని మండిపడ్డారు.. దానికి తగ్గట్టుగానే ఆధారాలు కూడా చూపించారు. ఈ వ్యవహారం మొత్తం గులాబీ పార్టీలో అంతర్గత రచ్చకు కారణం కావడంతో ఏకంగా గులాబీ దళపతి కేసీఆర్ రాజయ్యను ప్రగతి భవన్ పిలిపించుకున్నారు. గట్టిగా క్లాస్ కూడా పీకారు. దీంతో రాజయ్య క్షమాపణలు చెప్పక తప్పలేదు.. అంతటితో ఆ ఎపిసోడ్ ఆగలేదు.
సర్పంచ్ నవ్య సాగించిన యుద్ధం వల్ల రాజయ్యకు కెసిఆర్ టికెట్ కూడా ఇవ్వలేదు. స్టేషన్ గన్ పూర్ నియోజకవర్గం లో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. ఆయన గులాబీ పార్టీ గుర్తు మీద గెలిచి.. రాజకీయ అవసరాల దృష్ట్యా వేరే మార్గం వైపు వెళ్లిపోయారు.. దీంతో మళ్ళీ రాజయ్య రాజకీయంగా యాక్టివ్ అయిపోయారు.. శ్రీహరి మీద యుద్ధం మొదలుపెట్టారు.. ఒక రకంగా నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. శ్రీహరిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా మరోసారి తన అడుగులను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రాజయ్య రాజకీయ జీవితం తలకిందులు కావడానికి ప్రధాన కారణమైన నవ్య మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
సర్పంచ్ నవ్యకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.. ఆ వీడియోలో నవ్య తన భర్తతో కలిసి ఉన్నారు.. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళిన నవ్య.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతేకాదు గిటార్ పట్టుకుని తన భర్తతో కలిసి సంచలనం సృష్టించారు. ఆమె 360 డిగ్రీలు తిరిగే యంత్రం మీద కూర్చుని ఉండగా.. కెమెరా లో ఆమె ఫోటోలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అయింది.. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ నాయకులు తెగ సర్కులేట్ చేస్తున్నారు. సర్పంచ్ నవ్య బయటకు వచ్చిందని.. ఈసారి మళ్లీ రాజయ్యను టార్గెట్ చేస్తుందని.. అతనికి రాజకీయ జీవితం లేకుండా చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.. ఏది ఏమైనప్పటికీ అప్పట్లో మీడియాను, సోషల్ మీడియాను షేక్ చేసిన నవ్య.. మరోసారి బయటకు వచ్చింది. ఈసారి ఎవరి రాజకీయ జీవితానికి స్పాట్ పెడుతుందో చూడాల్సి ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram