HomeతెలంగాణSarpanch Elections In Telangana: అమ్మకానికి సర్పంచ్‌ పదవులు : రూ.కోటి ఇచ్చుకో.. సర్పంచ్ పదవి...

Sarpanch Elections In Telangana: అమ్మకానికి సర్పంచ్‌ పదవులు : రూ.కోటి ఇచ్చుకో.. సర్పంచ్ పదవి తెచ్చుకో..

Sarpanch Elections In Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఈ క్రమంలో సర్పంచ్‌ స్థానాలు ఇప్పుడు ప్రజా సేవల నుండి దూరంగా, పెద్ద వ్యాపారాల చేతిలో లాభదాయక స్థలాలుగా మారాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా టంకర్‌ గ్రామ పంచాయతీని ఒక వ్యాపారి రూ.కోటికి కొనుగోలు చేయడం ఈ ధోరణిని స్పష్టం చేస్తోంది. ఇది స్థానిక రాజకీయాల్లో నిధుల వినియోగంపై కూడా ప్రత్యేకమైన ఒప్పందాలను తెస్తోంది.

సామాజిక వాటాదారులుగా..
ఈ పదవుల వేలంలో గమనించదగ్గ విషయం, స్థానిక ఆలయాలు లేదా సామాజిక సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించి, ఆ నిధుల వినియోగంపై స్పష్టం ఒప్పందాలుచేయడం. ఉదాహరణకు, ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్టకు నిధుల ఖర్చు చేయనున్నట్లు ఆ వ్యాపారి అంగీకారం తెలిపారు. ఇది రాజకీయ పథకాలలో హేతుబద్ధతను చూపిస్తుంది.

వివిధ గ్రామాల వేలం..
గద్వాల జిల్లా వివిధ గ్రామాలలో సర్పంచ్‌ సీట్ల కోసం వేలం ధరలు భారీగా పెరగడం, స్థానిక రాజకీయాల్లో నగదు శక్తి ఎంత పెరిగిందో తెలియజేస్తుంది. కొండపల్లి రూ.60 లక్షలు, గొర్లఖాన్‌ దొడ్డి రూ.57 లక్షలు, చింతలకుంట రూ.38 లక్షలు, ముచ్చోనిపల్లి రూ.14.90 లక్షలు, ఉమిత్యాల తండా రూ.12 లక్షలు వంటి భారీ వర్షాలు, పంచాయతీ ఎన్నికల వ్యవస్థలో నైతిక విలువలు తగ్గిపోవటానికి సంకేతాలు.

జకీయాల్లోకి వాణిజ్య శక్తులు..
స్థానిక పాలనలో వ్యాపారులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వస్తున్నారు. సర్పంచ్‌ స్థానాలను వాణిజ్య వస్తువులుగా మారుస్తున్నారు. ఇది ఉపాధి, సామాజిక అభివృద్ధి లక్ష్యాలకు మించిపోయి, రాజకీయ వ్యవస్థ మరింత సరిహద్దులను దాటే ప్రమాదం ఉంది. సరైన నియంత్రణలు లేకుంటే, గ్రామస్థాయి పాలనా వ్యవస్థ అవినీతికి బలవంతంగా మారే అవకాశముంది.

జనాలకైనా డబ్బులు పంచాలనే..
ఇక వ్యాపారులు, కాంట్రాక్టర్లు పదవుల వేలంలోకి రావడానికి ప్రధాన కారణం ఓటర్లు డబ్బులు తీసుకోవడమే. ఎన్నికలు నిర్వహించినా.. ఒక్కో సర్పంచ్‌ అభ్యర్థి కనీసం రూ.10 నుంచి రూ.20 లక్షలు ఖర్చు పెట్టాలి. ఓటర్లకు పంచేందుకు మరో రూ.10 లక్షలు ఖర్చు చేయాలి. ఇంత చేసినా గెలుస్తామన్న ధీమా ఉండదు. అందుకే గ్రామాల్లో చాలా మంది ఏకగ్రీవం కోసం ఏకంగా వేలం నిర్వహించడానికే మొగ్గు చూపుతున్నారు.

ఒకప్పుడు సర్పంచ్‌ స్థానాలకు విలువ ఉండేది. ఇప్పుడు మసకబారిన రాజకీయ ప్రయోజనాలు, నగదు శక్తి ప్రభావంతో విలువ తగ్గిపోయింది. డబ్బులు ఉన్నవారిదే పదవి అన్నట్లుగా రాజకీయాలు మారిపోతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular