Balakrishna And NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి గొప్ప గుర్తింపైతే ఉంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు వేసిన బాటలోనే ఆ ఫ్యామిలీ మొత్తం నడుస్తోంది. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేశాయనే చెప్పాలి. పౌరాణిక పత్రాలను ఆయన తప్ప ఇంకెవరు పోషించలేరు అనేంతలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆయన తర్వాత వచ్చిన బాలయ్య బాబు సైతం మాస్ హీరోగా ఎదిగాడు. ఇక ఆ ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మంచి విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు… ఇక గత కొన్ని రోజుల నుంచి బాలయ్య బాబుకి ఎన్టీఆర్ కి మధ్య విబేధాలు వచ్చిన విషయం అంశాలకు తెలిసిందే…అది నందమూరి అభిమానులకు సైతం నచ్చడం లేదు. టిడిపి కార్యకర్తలు సైతం బాలయ్య బాబు వైపే ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఎవరు పట్టించుకోవడం లేదు. నిజానికి వీళ్ళ మధ్య జరిగిన గొడవ ఏంటి అసలు మాట్లాడుకోలేనంతగా గొడవలు జరిగాయా అనే విషయాలు చాలామందిని కలవరపెడుతున్నాయి. నిజానికి వీళ్ళిద్దరి మధ్య మూడు విషయాల్లో గొడవలు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి…
కెరియర్ స్టార్టింగ్ లో బాలయ్య బాబు చేయాల్సిన ఒక సినిమాని జూనియర్ ఎన్టీఆర్ చేశారంటూ బాలయ్య బాబు అప్పట్లో కొంతవరకు కోపాన్ని వ్యక్తం చేశారట. ఇక అది సర్దుమణిగిన తర్వాత మరోసారి టిడిపి పార్టీ క్యాంపెనింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పిలిస్తే రాకపోవడంతో మరోసారి వీళ్ళిద్దరి మధ్య విభేదాలైతే భగ్గుమన్నట్టుగా తెలుస్తున్నాయి.
ఇక దాని తర్వాత బాలయ్య బాబు – జూనియర్ ఎన్టీఆర్ మధ్య పెద్దగా మాటలైతే లేకుండా పోయాయి. ఇక మరోసారి 2024 ఎలక్షన్స్ కి ముందు చంద్రబాబు నాయుడు ని అనవసరంగా అరెస్టు చేస్తే కనీసం చూడ్డానికి కూడా రాలేదనే కోపం బాలయ్య బాబుకి ఎక్కువగా ఉండిపోయింది.
దాని వల్లే ఈ మూడు కారణాలు వల్లే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాలని చూస్తున్నా కూడా బాలయ్య బాబు అతన్ని దూరం పెడుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో వీళ్ళ మధ్య మాటలు కలుస్తాయా లేదా అని ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి వీళ్ళ మధ్య మాటలు కలిసి మళ్ళీ నందమూరి అభిమానులను ఆనంద పడేలా చేస్తారా లేదా అనేది…