Samatamoorthy Statue: సమతామూర్తి రామానుజం టెంపుల్ ప్రత్యేకత.. ముచ్చింతల్ కు ఆర్టీసీ బస్సులు, రైళ్లు రూట్స్ ఇవే!

Samatamoorthy Statue: తెలంగాణలో మరో అద్భుత వేడుకకు రంగం సిద్ధమైంది. దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్రపతి నుంచి ప్రధాని వరకూ ఈ దివ్యక్షేత్రానికి రానున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అష్టాక్షరీ జపంతో సహస్రాబ్ది మహోత్సవం ప్రారంభమైంది. సమతామూర్తి వైభవాన్ని ప్రపంచానికి చాటేలా 12 రోజుల పాటు జరిగే వేడుకల కోసం ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ముస్తాబైంది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి అంకురార్పణ జరుగనుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం […]

Written By: NARESH, Updated On : February 4, 2022 12:22 pm
Follow us on

Samatamoorthy Statue: తెలంగాణలో మరో అద్భుత వేడుకకు రంగం సిద్ధమైంది. దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్రపతి నుంచి ప్రధాని వరకూ ఈ దివ్యక్షేత్రానికి రానున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అష్టాక్షరీ జపంతో సహస్రాబ్ది మహోత్సవం ప్రారంభమైంది. సమతామూర్తి వైభవాన్ని ప్రపంచానికి చాటేలా 12 రోజుల పాటు జరిగే వేడుకల కోసం ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ముస్తాబైంది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి అంకురార్పణ జరుగనుంది.

Samatamoorthy Statue

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు. 45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో దివ్యక్షేత్రం.. ఆరేళ్లలో నిర్మాణం 216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం బరువు 1800 కిలోలతో తీర్చిదిద్దారు. చైనాలో 1600 భాగాలుగా తయారీ గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’ సమతామూర్తి చుట్టూ 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం 2 నుంచి 14వ తేదీ దాకా 12 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి,ప్రధాని.. సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణలో కార్యక్రమం 5న మోదీ రానున్నారు. మహావిగ్రహ ఆవిష్కరణ చేసి జాతికి అంకితమివ్వనున్నారు. 13న రాష్ట్రపతి వస్తున్నారు.

Also Read:  మరో స్టార్ హీరోకి విడాకులు… త్వరలో షాకింగ్ ప్రకటన!

శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి సంకల్పంతో ముచ్చింతల్‌ దివ్యక్షేత్ర పనులు 2016లో ప్రారంభమయ్యాయి. 45 ఎకరాల విస్తీర్ణంలో రూ.1000 కోట్లతో పనులు జరిగాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి నిర్మాణాలు చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 2700 మంది శిల్పులు పాల్గొన్నారు. ప్రధానంగా.. సమతామూర్తి 216 అడుగుల మహా పంచలోహ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించారు. దీని బరువు 1800 కిలోలు. తొమ్మిది నెలల పాటు శ్రమించి..1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను మనదేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 మంది నిపుణులొచ్చి విగ్రహ రూపునిచ్చారు. వాతావరణ మార్పులను తట్టుకొని వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

శ్రీరామనుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలను 1035 కుండాలతో కూడిన లక్ష్మీనారాయణ మహాయాగంతో ప్రారంభిస్తున్నారు. తొలుత ఆ ప్రాంత భూమి పూజ, వాస్తు పూజ చేస్తారు. వివిధ సంప్రదాయాలను అనుసరించే 5వేల మంది రుత్వికులు దీక్షాధారణ చేసి పూజల్లో పాల్గొంటారు.

ఈ వేడుకలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ప్రయాణికుల కోసం తెలంగాణ ప్రభుత్వం బస్సు, రైలు సౌకర్యాలనుకల్పించింది. అనేక మార్గాలు రావడానికి అందుబాటులో ఉంచారు.

-బస్సు సర్వీసులు
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. ముచ్చింతల్ కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. 455 నంబర్ బస్సు ఎక్కి శంషాబాద్ చేరుకోవచ్చని.. లేదా ఉప్పల్ నుంచి 300 నంబర్ బస్సు ఎక్కి ఆరాంఘర్ కు చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి శంషాబాద్ మీదుగా తొండుపల్లి, ఘాన్సిమాయా గూడ, పెద్దషాపూర్, మదనపల్లి, బస్టాపు మీదుగా శ్రీరామనగరం చేరుకోవచ్చు.

ఇక ఎంజీబీఎస్ నుంచి షాద్ నగర్ వైపు వెళ్లే బస్సు ఎక్కి మదనపల్లి దగ్గర దిగాల్సి ఉంటుంది. అక్కడ ఆటో ఎక్కి రామానుజ టెంపుల్ కు చేరుకోవచ్చు.

-రైలు సర్వీసులు
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారు రైలులో ప్రయాణిస్తే కాచిగూడలో దిగిన అనంతరం 2 లేదా 3 నంబర్ ఆర్టీసీ బస్సు ఎక్కి అప్ఝల్ గంజ్ నుంచి శంషాబాద్, షాద్ నగర్ వైపు వెళ్లే బస్సుల్లో మదనపల్లికి చేరుకోవచ్చు.

ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగితే 251 నంబర్ బస్సు ఎక్కి శంషాబాద్ చేరుకోవచ్చు. నాంపల్లి రైల్వే స్టేషల్ లో దిగితే 7,8,9 నంబర్ బస్సులో అప్ఘల్ గంజ్ చేరుకోవచ్చు.

శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ జరుగుతాయి. ఈరోజుల్లో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపనుంది.