HomeతెలంగాణTeenmar Mallanna: ఫోన్‌ ట్యాపింగ్‌ కారణంగా సమంత-చైతన్య విడిపోయారు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Teenmar Mallanna: ఫోన్‌ ట్యాపింగ్‌ కారణంగా సమంత-చైతన్య విడిపోయారు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Teenmar Mallanna: తెలంగాణలో ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో కొనసాగుతోంది. ఎస్సై నుంచి ఐపీఎస్‌ వరకూ ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. మొదట ప్రణీత్‌రావు అరెస్టుకాగా, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది పేర్లు బయటకు వచ్చాయి. మరో ఐదుగురు అరెస్ట్‌ కూడా అయ్యారు.

సినీ స్టార్ల ఫోన్టు కూడా..
తాజాగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రాజకీయ నాయకుల నుంచి సినిమా స్టార్ల వరకు వెళ్లింది. దీంతో టాలీవుడ్‌లోనూ ఈ వ్యవహారం కలకలం సృష్టిసో‍్తంది. పలువురు హీరో హీరోయిన్ల ఫోన్లను గత ప్రభుత్వం ట్యాప్‌ చేసిన విషయం బయటకు వచ్చింది. దీంతో సినీ ప్రముఖుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పటికే అరెస్ట్‌ అయిన ప్రణీత్‌రావు విచారణలో రోజుకో సంచలన విషయాలు బయటకు చెబుతున్నారు. ఇప్పటికే పోలీస్‌ శాఖకు చెందిన పలువురి పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు వెల్లడించారు. తాజాగా సినిమా వాళ్ల పేర్లు బయట పెట్టారు. అయితే ఈ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేశారనే వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఓ స్టార్‌ హీరోయిన్‌ పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి ఫోన్‌ ట్యాపింగే కారణమని ప్రచారం కావడం సంచలనంగా మారింది. అయితే దీనిపై ఎవరూ స్పందించకపోవడంతో మరింత ఆసక్తి చేపుతోంది.

తీన్మార్‌ మల్లన్న స్పందన..
ఇదిలా ఉండగా కవిత అరెస్టు నేపథ్యంలో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు తీన్మార్‌ మల్లన‍్న ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఫోన్‌ ట్యాపింగే కారణమని పేర్కొన్నారు. అప్పటి అధికార పార్టీ కీలక నేత, మందులు ఇచ్చే వ్యక్తి జోక్యంతోనే వారు విడిపోయారని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకుని దానిపై వీడియో చేస్తానని చెప్పడం సంచలనంగా మారింది. అయితే దీనిలో వాస్తవం ఎంత ఉంది అనేది ఆసక్తి చేబుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version