Rythu Bharosa: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. రైతును రాజును చేసే రైతుభరోసా, పేదల సొంతింటి కళ సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Illu), కూలీకి చేయూతనిచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతోపాటు అన్నార్తుల ఆకలి తీర్చే రేషన్ కార్డులు(Ration Cards) వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిపుతామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఈ పథకాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం అర్ధరాత్రి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు సమ అవుతాయని తెలిపారు. తొలి దశలో ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. సుమారు 10 లక్షల మంది రైతుల కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అందచే సూచనలు ఉన్నట్లు సమాచారం.
ప్రతీ ఎకరాకు రూ.12 వేలు..
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా రైతు భరోసాపై అప్‌డేట్ ఇచ్చారు. ఈ ఏడాది రైతు భరోసా కింద సాగులో ఉన్న ప్రతీ ఎకరాకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. భూమిలేని నిరు పేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Atmeeya Bharosa) కింద ఏడాదికి రెండు విడతలుగా రూ.12 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనగదు కూడా నేరుగా కూలీల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. రైతులతోపాటు కూలీలకు కూడా ఆదివారం అర్ధరాత్రి నుంచి బ్యాంకు ఖాతాల్లో రూ.6 వేల చొపుపన జమ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం రైతులు, కూలీలు బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకోవచ్చని తెలిపారు.
బ్యాంకు వద్ద క్యూ..
రైతులు, కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అయిన నేపథ్యంలో సోమవారం ఉదయం బ్యాంకుల వద్ద రైతులు క్యూ కట్టారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులు వేకువ జామునే బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో బ్యాంకుల వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. చాలా మంది డబ్బులు డ్రా చేసుకునేందుకు రాగా, కొందరికి మెస్సేజ్‌లు రాలేదు. దీంతో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందకు కూడా బ్యాంకుకు వస్తున్నారు.