Mahalaxmi Scheme Rumors: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు ఎదుట బుధవారం ఉదయం షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. తెలంగాణ ప్రభుత్వ మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 నగదు జమ చేస్తున్నారంటూ వదంతులు పుట్టించటంతో, పెద్ద ఎత్తున మహిళలు పోస్టాఫీసు ఎదుట గుమికూడారు.
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఖాతా ఉన్నవారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయన్న నమ్మకంతో అనేక మంది తమ ఆధార్ కార్డులతో బారుల కట్టారు. సమాచారంలో స్పష్టత లేకపోవడం, అధికారుల విఫల సమన్వయం వల్ల మహిళలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున తరలిరావడం గమనార్హం. అయితే అక్కడ ఖచ్చితమైన విధానం లేకపోవడం, ఎవరికీ ఎలాంటి సమాచారం తెలియకపోవడం వల్ల మహిళల మధ్య తోపులాట మొదలైంది.
Also Read: దసరాకు ఊరు వెళ్లేదెలా? ట్రైన్ల పరిస్థితి ఇలా ఉంది?
ఇంకా ఆగ్రహించిన కొంతమంది మహిళలు పరస్పరం దూషించుకొని, కొట్టుకునే దాకా వెళ్లారు. ఒకరిపై ఒకరు జుట్టు పట్టుకొని లాగేసుకుంటూ తీవ్ర ఉద్రిక్తతకు దిగారు. ఆ దృశ్యాలు చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
-అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల్లో అపోహలు:
ఈ వ్యవహారంపై స్పందించిన స్థానికులు మాట్లాడుతూ “ప్రభుత్వం పథకం గురించి స్పష్టత ఇవ్వకపోవడం, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇటువంటి అపోహలు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన తప్పుడు సమాచారాన్ని నమ్మి బాధితులుగా మేమే మారుతున్నాం” అని వాపోయారు.
పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టాఫీసు అధికారులు మాత్రం ఈ వదంతులపై విస్మయం వ్యక్తం చేశారు. “ఇలాంటివి ఎక్కడి నుండి వచ్చాయి మాకు తెలియదు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి మా బ్యాంక్‌లో డబ్బులు జమ చేసే ప్రక్రియ లేదంటూ” వారు స్పష్టం చేశారు.
మహాలక్ష్మి పథకం వంటి గొప్ప సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఉండాలి. కానీ ప్రభుత్వ సమాచార వ్యవస్థలో స్పష్టత లేకపోతే, అలాంటి పథకాలు మహిళలకు శాపంగా మారే ప్రమాదం ఉంది. తక్షణమే ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోతే, ఇలాంటి ఘర్షణలు మళ్ళీ పునరావృతం కావచ్చు.
మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఇస్తున్నారంటూ పుకార్లు.. దారుణంగా కొట్టుకున్న మహిళలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 జమ చేస్తున్నారంటూ పుకార్లు
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ ఉంటేనే వస్తుందని వదంతులు రావడంతో ఆధార్ కార్డులు… pic.twitter.com/JlrgYq6kWL
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2025