Mrunal Thakur Dating Dhanush: ఇండియా లోనే విలక్షణ నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న హీరోలలో ఒకరు ధనుష్(Dhanush K Raja). ఎలాంటి క్యారక్టర్ లో అయినా పరకాయ ప్రవేశం చేసి, అద్భుతమైన నటన కనబర్చడంలో ఆయనకు ఆయనే సాటి. తమిళం లో స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న ధనుష్, తెలుగులో ,హిందీ లో కూడా అనేక సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా నటించి అక్కడి ఆడియన్స్ కి కూడా మరింత దగ్గరయ్యాడు. మన తెలుగు లో ‘సార్’ అనే చిత్రం తో మొట్టమొదటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ధనుష్, ఆ తర్వాత రీసెంట్ గానే శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో తెరకెక్కిన ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం తో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ చిత్రం లో ఆయన అద్భుతమైన నటన ని చూసి ప్రతీ ఒక్కరు ఎంత గొప్పగా మెచ్చుకున్నారో మనమంతా చూశాము.
Also Read: న్యాయ పోరాటానికి సిద్దమైన ధనుష్ దర్శకుడు..వివాదం తారాస్థాయికి చేరిందిగా!
సినీ కెరీర్ పరంగా ధనుష్ రేంజ్ ప్రస్తుతం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంది. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆయనపై ఎన్నో విమర్శలు, రూమర్స్, ఆరోపణలు ఉన్నాయి. రీసెంట్ గానే తన భార్య ఐశ్వర్య తో విడాకులు తీసుకున్న ధనుష్, గత కొంతకాలం గా ప్రముఖ హాట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తో ప్రేమాయణం నడుపుతున్నాడని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారని, కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని, తమిళనాడు మీడియా లో ఎన్నో వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. ఆ ప్రచారాలకు బలపరుస్తూ రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ మూవీ ఈవెంట్ కి ధనుష్ ముఖ్య అతిథుల్లో ఒకరిగా హాజరు కావడం అందరినీ షాక్ కి గురి చేసింది. ధనుష్ ఈ సినిమా ఈవెంట్ లో ఎందుకు ఉన్నాడు?, ఈ చిత్రం లో ఆయన నటించాడా అని ఆయన అభిమానులు గూగుల్ చేసి కూడా చూశారు.
కానీ అలాంటిదేమి లేదని తెలిసింది. ధనుష్ కేవలం ఈ ఒక్క ఈవెంట్ కి మాత్రమే కాదు, గతంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ‘మా’ అనే చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఒక అతిథిగా హాజరయ్యాడు. ఈ రెండు సంఘటనలను పరిశీలించి చూస్తే వీళ్లిద్దరు డేటింగ్ లోనే ఉన్నారు అనేది స్పష్టమవుతుంది. అయితే ఈ రూమర్స్ పై మృణాల్ ఠాకూర్ నేడు స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘ధనుష్ నాకు ఒక మంచి స్నేహితుడు. మా మధ్య ఎదో జరుగుతుందని రీసెంట్ గా కొన్ని రూమర్స్ రావడం నా దృష్టికి వచ్చింది. వాటిని చూసి నేను నవ్వుకున్నాను. ధనుష్ కి అజయ్ దేవగన్ గారు కూడా మంచి సన్నిహితుడు, ఆయనే మొన్నటి ‘సన్ ఆఫ్ సర్దార్ 2′ ఈవెంట్ కి ప్రత్యేకంగా ఆహ్వానించాడు. ఒక ఈవెంట్ కి వచ్చినందుకు మాకు లింక్ పెట్టేశారు’ అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.