RS Praveen Kumar Tweets Viral: తెలంగాణ కేసీఆర్ జాగీరా అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత వేమూరి రాధాకృష్ణ ఆదివారం రాసిన కొత్త పలుకు వ్యాసం కలకలం సృష్టిస్తోంది. నిన్నటి నుంచి ఈ వ్యాసం పై భారత రాష్ట్ర సమితి నాయకులు మండిపడుతూనే ఉన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన కేసీఆర్ ను ఇలా విమర్శించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.. భారత రాష్ట్ర సమితి నాయకులు తీవ్రస్థాయిలో స్పందించిన నేపథ్యంలో.. ఆంధ్రజ్యోతి కార్యాలయాల పై దాడులు జరుగుతాయని ముందుగానే ఊహించిన తెలంగాణ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ ఫోటోలను భారత రాష్ట్ర సమితి నాయకులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా.. రాధాకృష్ణకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఆదివారం కొత్త పలుకు వ్యాసాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ భారత రాష్ట్ర సమితి నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అనేక ప్రశ్నలను ఆయన వేశారు. అసలు ఆంధ్రమూలాలు ఉన్న పత్రిక తెలంగాణలో ఉండాల్సిన అవసరం ఏముందని? తెలంగాణ ప్రజలు ఆ పత్రికను ఎందుకు కొనాలని? ఆ పత్రికకు ఎందుకు ప్రకటనలు ఇవ్వాలని ప్రశ్నించారు. అయితే ఆయన చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. మరోవైపు ఆ ట్వీట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రశ్నిస్తూ అనేకమంది ఘాటుగా స్పందించారు. ఇక సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో ట్వీట్ చేశారు. చెత్తవాగుడు ఎందుకు.. గజగజ వణుకుడు ఎందుకు.. అని ప్రశ్నించారు. ఆర్కే రాసిన వ్యాసాన్ని.. ఆయన ఛానల్ ప్రసారాలు నడుస్తున్న కార్యాలయం ఎదుట పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న దృశ్యాలను ఒక ఫోటో రూపంలో ఏర్పాటు చేసి.. ఆయన ట్వీట్ చేశారు.
Also Read: అబ్బా.. ఎంత ప్రేమో.. ఆంధ్రజ్యోతిని నెత్తిన పెట్టుకొని తిరుగు ‘బండి’ అన్న..
ఆర్ఎస్పీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.. ఇటువంటి ట్వీట్లు చేయడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ఆర్ఎస్పీ ని ప్రశ్నిస్తున్నారు..” గతంలో గులాబీ పార్టీపై మీరు ఎటువంటి ఆరోపణలు చేశారు? కెసిఆర్ ను ఏ విధంగా విమర్శించారు? గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చోటు చేసుకున్న అవకతవకలపై మీరు ఎలాంటి ప్రశ్నలు సంధించారు? ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయారు.. గతంలో మీరు ఐపీఎస్ అధికారిగా పనిచేశారు కదా.. ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకురావడం సమంజసమేనా” అంటూ నెటిజన్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు.
గతంలో గులాబీ పార్టీ అధినేతను ఉద్దేశించి ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను.. వీడియోలను కొంతమంది నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆ దృశ్యాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ట్యాగ్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నిరసన సెగ తగులుతుండడం విశేషం.. మరి దీనిపై ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
చెత్త చెత్త వాగుడెందుకు?
గజ గజ వణుకుడెందుకు?
pic.twitter.com/dHsH5D9s41— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 7, 2025