Thammudu 3 Days Collections: నితిన్(Actor Nithin), వేణు శ్రీ రామ్(Venu Sriram) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తమ్ముడు'(Thammudu movie) చిత్రం రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ టాక్ కారణంగా ఈ సినిమా ఓపెనింగ్స్ పై మాములు రేంజ్ ప్రభావం చూపలేదు. అసలే నితిన్ గత 5 చిత్రాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఆయన గత చిత్రం ‘రాబిన్ హుడ్’ అయితే కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేదు. నితిన్ సినిమాలు ఎంత చెత్తగా ఉన్నా ఒకప్పుడు మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్ కూడా రాలేదని అప్పట్లో అనుకున్నారు. కానీ ‘తమ్ముడు’ మూవీ ఓపెనింగ్ వసూళ్లు చూసిన తర్వాత ‘రాబిన్ హుడ్’ ఎంతో బెటర్ కదా అనే ఫీలింగ్ వచ్చింది.
మొదటి వీకెండ్ ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలకు కలిపి కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ నుండి రావాల్సిన వసూళ్లు వీకెండ్ కి వచ్చాయి. ఇంతటి దయనీయమైన పరిస్థితి లో నితిన్ ఇప్పుడు సినిమాలు తియ్యడం అవసరమా చెప్పండి అంటూ ట్రేడ్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మూడు రోజులకు కలిపి 89 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఒకప్పుడు నైజాం ప్రాంతంలో మన స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని వసూళ్లను రాబడుతూ సంచలనాలు సృష్టించిన నితిన్, ఇప్పుడు మూడు రోజులకు కలిపి కోటి రూపాయిల షేర్ ని కూడి రాబట్టలేకపోయాడంటే, ఆయన మార్కెట్ ఏ రేంజ్ లో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సీడెడ్ ప్రాంతం లో అయితే మరీ దారుణం. ఇక్కడ ఈ చిత్రానికి విడుదలకు ముందు మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
Also Read: రియల్ కుంభకోణం.. స్టార్ హీరో మహేష్ బాబుకు మరో నోటీసులు.. టాలీవుడ్ లో కలకలం!
మూడు రోజులకు కలిపి కేవలం పాతిక లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. గడిచిన రెండేళ్లలో సీడెడ్ ప్రాంతంలో ఈ రేంజ్ డిజాస్టర్ ని చూడలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆంధ్ర ప్రాంతం లో 8 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగితే, మూడు రోజులకు కలిపి కేవలం కోటి 12 లక్షల రూపాయిలు మాత్రమే వచ్చాయట. అలా ఓవరాల్ గా ఓవర్సీస్ ప్రాంతం వసూళ్లతో కూడా కలుపుకొని చూస్తే ఈ చిత్రానికి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. దిల్ రాజు ఈ చిత్రానికి 70 కోట్ల రూపాయలకు పైగానే డబ్బు ఖర్చు చేసానని ఈ సినిమా ప్రొమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. అంటే దాదాపుగా 30 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట.