https://oktelugu.com/

Hyderabad: ఫాస్ట్‌ఫుడ్‌ తింటున్నారా… ఇది చూస్తే జన్మలో తినరు..! వెలుగులోకి షాకింగ్ వీడియో

ఫాస్ట్‌ఫుడ్‌.. ఇటీవల చాలా మంది ఫుడ్‌ లవర్స్‌ ఇష్టపడే ఆహారం ఇది. దీంతో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. నూడుల్స్, మంచూరియా, ఎగ్‌ నూడుల్స్, చికెన్‌ నూడుల్స్, వెజ్‌ మంచూరియా, చికెన్‌ మంచూరియా ఇలా వివిధ పేర్లతో ఆకర్షిస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : October 19, 2024 10:01 am
Hyderabad(9)

Hyderabad(9)

Follow us on

Hyderabad: ఫాస్ట్‌ఫుడ్‌ చాలా ప్రమాదకరమని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంజూరియాలో ప్రమాదకరమైన ఫుడ్‌ కలర్‌ కలుపుతున్నారని గుర్తించారు. ఇక ప్రముఖ హోటళ్లలో యూజ్‌ చేసిన ఆయల్, జంతువుల కొవ్వులతో తయారుచేసిన ఆయిల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ తయారీలో వాడుతున్నారని తెలిపారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దేశంలోని పలు కేంద్రాల్లో తనిఖీలు చేసి పట్టుకున్నారు కూడా. ఇక ఇప్పుడు మరో భయంకరమైన నిజం వెలుగు చూసింది. ఆయిల్, కలర్‌తోపాటు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు సరఫరా చేసే చికెన్‌ కూడా కుళ్లిపోయినదే అని తేలింది. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు తక్కువ ధరకు చికెన్‌ కావాలని కోరుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు అమ్ముడు పోని నిల్వ చేసిన చికెన్‌ను సాయంత్రం పొద్దుపోయాక ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు తరలిస్తున్నారు, ఈ సెంటర్ల నిర్వాహకులు దానిని రాత్రి నిల్వ చేసి మరుసటి రోజు, ఆ తర్వాతిరోజు.. వేడివేడి నూనెలో ఫ్రైచేసి కస్టమర్లకు విక్రయిస్తున్నారు.

7 క్వింటాళ్ల కుళ్లిన చికెన్‌..
హైదరాబాద్‌ బేగంపేటలోని పలు చికెన్‌ సెంటర్లపై శుక్రవారం(అక్టోబర్‌ 17న) దాడులు చేశారు. బాలయ్య చికెన్‌ సెంటర్‌లో తనిఖీ చేయగా అందులో కుళ్లిపోయిన మాంసం, కొవ్వు పదార్థాలు లభ్యమయ్యాయి. మొత్తం 7 క్వింటాళ్లు(700 కిలోలు) కుళ్లిన చికెన్‌ పట్టుకున్నారు. నిర్వాహకులను విచారణ చేయగా, ఇలా కుళ్లిన కోడి మాంసానికి కెమికల్స్‌ కలిపి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, జనతా బార్లు, బెల్ట్‌ షాపులకు, మద్యం షాపుల్లోని పర్మిట్‌ రూంలకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

లొట్టలేసుకు తింటున్నారు..
చాలా మంది ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో, మద్యం దుకాణాల్లో, పర్మిట్‌ రూంలలో చికెన్‌ ఐటమ్స్‌ను ఇష్టంగా తింటున్నారు. బాగా మరిగే నూనెలో కుళ్లిన చికెన్‌ వేయడం ద్వారా, దానికి పిండి, కలర్‌ పూయడం ద్వారా కుళ్లిన ఆనావాళ్లు, వాసన కనిపించవు. ఇదే అదనుగా ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, బెల్ట్‌ షాపుల యజమానులు, జనతాబార్‌ నిర్వాహకులు, మద్య షాపుల్లో పర్మిట్‌ రూం నిర్వాహకులు ఈ చికెన్‌ కొనడానికే ఆసక్తి చూపుతున్నారు.

రాష్ట్రమంతా ఇదే పరిస్థితి..
రాష్ట్రంలోని అన్ని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, పర్మిట్‌ రూంలు, జనతా బార్లలో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. రీయూజ్‌ ఆయిల్, జంతువుల కొవ్వుతో తయారు చేసే ఆయిల్, కుళ్లిన ఆహారం, నకిలీ సాస్, కలర్స్, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వాడుతున్నట్లు పేర్కొంటున్నారు. అయినా బాగా మరిగే నూనెలో వీటిని వేయించడం ద్వారా రుచిలో ఎలాంటి తేడా తెలియడం లేదంటున్నారు. హై ఫ్లేమ్‌లో వేడిచేసిన ఆహారం తినడం వలన కూడా క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక రోగాలు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. దీనికితోడు నకిలీ, నాసికరం, కుళ్లిన పదార్థాలతో ముప్పు ఎక్కువ అని చెబుతున్నారు.