Coils : దోమలను తరమడానికి కాయిల్స్ వాడుతున్నారా? అత్యంత ప్రమాదకరం..?

వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువ ఉంటుంది. ఏ కాలం అయినా సరే చెత్త ఉంటే కచ్చితంగా దోమలు దాడి చేస్తుంటాయి. వీటి స్వైర విహారంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇక సాయంత్రమైతే చాలు దోమలు ఇంట్లోకి వచ్చి వాటికి ఇష్టం వచ్చినట్టు కుడతాయి. ఎంత తలుపులు వేసినా ఓ పట్టాన వదలనే వదలవు కదా. కుట్టి చంపేస్తుంటాయి. ఇవి కుట్టడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అయితే, వీటిని ఇంట్లోకి రావొద్దొని మెష్ డోర్స్ వాడినా, దోమ తెరలు వాడినా ఏదో మూలలో నుంచి రావడం మాత్రం కామన్ గా జరుగుతుంటుంది. వాటిని తరిమేందుకు చాలా మంది కాయిల్స్ వాడుతున్నారు. ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో వీటిని వాడేందుకే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే, వీటిని వాడడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వీటి వల్ల వచ్చే సమస్యలు ఏంటో చూసేద్దాం.

Written By: Swathi Chilukuri, Updated On : October 19, 2024 10:05 am

Using coils to repel mosquitoes? Most dangerous..?

Follow us on

Coils : మస్కిట్ కాయిల్స్‌లో హానికర కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల శ్వాస వ్యవస్థపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. ఈ పొగను పీల్చితే శ్వాస సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఆస్తమా, దగ్గు వంటివి వేధిస్తుంటాయి. ఈ పొగని పీలిస్తే ఊపిరి ఆడటం కూడా చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి, వీటిని వాడకుండా ఉండటమే మంచిది. మరికొంతమందికి ఈ పొగ అస్సలు పడదు కాబట్టి ఈ పొగ కారణంగా తలనొప్పి, మైకం, వికారం, చర్మంపై దద్దుర్లు, కంటి సమస్యలు వస్తాయి. కొందరికి ఈ పొగ వల్ల అలర్జీలు వస్తుంది. సెన్సెటీవ్ స్కిన్ ఉంటే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులకు నిలయం ఈ దోమల కాయిల్స్. ఇవి రక్తంలో కరిగుతుంది. దీంతో గుండెకి చేరి గుండె సమస్యలకు కారణం అవుతాయి. కొన్ని సార్లు అవి ప్రాణాంతకంగా మారతాయి. ఈ పొగని ఎక్కువగా పీలిస్తే చాలా సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఈ పొగ మన ఇళ్ళలో ఉన్న బట్టలు, ఇతర వాటికి కూడా చాలా త్వరగా వ్యాపించి సమస్యను మరింత పెద్దగా చేస్తాయి. సిగరెట్ పొగనే చాలా ప్రమాదకరం. దీనికంటే కూడా దోమ బిళ్లల పొగ మరింత ఎక్కువే అంటున్నారు నిపుణులు. దీని వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా వస్తాయట. ఈ మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగను పీలిస్తే బ్రెయిన్‌పై కూడా  ఎఫెక్ట్  పడుతుందట.దీంతో బ్రెయిన్ పనితీరు దెబ్బతింటుంది.ఈ పొగ మనం పీల్చే గాలిని కూడా కలుషితం చేస్తుంది.

దోమలను తరిమేందుకు కాయిల్స్ వాడకండి. నేచురల్ పద్ధతులతో దోమలు దూరం చేయడం అలవాటు చేసుకోండి.ముఖ్యంగా మీ ఇంటి వద్ద చెత్త పేరుకుపోకుండా చూసుకోండి. నిల్వ నీరు అసలే ఉండవద్దు. కుదిరితే దోమ తెరలు వాడండి. సాయంత్రమవ్వగానే కిటికీలు, తలుపులు మూసి వేయాలి. శరీరాన్ని కప్పి ఉంచే బట్టలు వేసుకోవడం మర్చిపోవద్దు. దోమల బ్యాట్స్ వాడడం బెటర్.