Homeటాప్ స్టోరీస్ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే పట్టుకుని వేలాడే వారిని ముమ్మాటికి తెలుగులో ఆకాశవాదులనే అంటారు. దీనిని రాధాకృష్ణ నిరూపించారు. కాలానికి తగ్గట్టుగా బతకాలని.. బతకనేర్చడమే జీవిత సూత్రమని రాధాకృష్ణ ఆదివారం నాటి కొత్త పలుకులో మరోసారి నిరూపించారు. ఈసారి ఏకంగా ఆయన బొద్దింకలకు ప్రారంభం నుంచి చివరిదాకా జై కొట్టారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత మనదేశంలో ప్రజలలో నెలకొన్న నిరాశ ఎలా ఉందో బయటపడిందని చెప్పుకొచ్చారు. అన్ని వ్యవస్థల మీద ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి న్యాయ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని.. న్యాయ వ్యవస్థ అనే తేనె తుట్ట మీద కూడా రాధాకృష్ణ రాయి వేశారు.. దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాకుండా.. ఇతర రాజకీయ వ్యవస్థల మీద కూడా ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని.. అందువల్లే బొద్దింకల ఉద్యమానికి తమ వంతుగా మద్దతు పలికారని.. ఇది ఒక సజీవ సాక్ష్యం లాగా నిలబడిందని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. కానీ జనరేషన్ జెడ్ ఉద్యమాన్ని ఒక రేంజ్ లో చూపించిన రాధాకృష్ణ.. దాని ఫలితాలను కూడా అధ్యయనం చేసి ఉంటే బాగుండేది. బంగ్లాదేశ్లో వెర్రి యువత ఉద్యమం చేసింది.. శ్రీలంకలోను అదే చేసింది. చివరికి నేపాల్ లోను అదే చేసింది.. ఏం జరిగింది.. ఆ దేశాలు ఎలా ఉన్నాయి.. యువత ఆకాంక్షలను అక్కడి ప్రభుత్వాలు ఫలప్రదం చేస్తున్నాయా అనేది రాధాకృష్ణ తెలుసుకోవాలి.

ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్పది. ఈ వ్యవస్థ మీద ప్రజలు నమ్మకాన్ని కోల్పోవడం లేదు. విశ్వాసాన్ని తగ్గించుకోవడం లేదు. కేవలం ఆ వ్యవస్థలను నాశనం చేస్తున్న వ్యక్తుల మీద మాత్రమే ప్రజలకు కోపం ఉన్నది. వాటిని సమర్థవంతంగా నడిపించలేక పాలకులు ప్రజల్లో నిరాశకు కారణమవుతున్నారు. పాలకులు ప్రజాస్వామ్యాన్ని గొప్పగా నడిపించిన రోజులను ఈ దేశం చూసింది. కానీ ఆ విషయాన్ని రాధాకృష్ణ విస్మరించారు.

బొద్దింకల ఉద్యమం పుట్టడానికి ప్రధాన కారణం సిజెఐ.. ఇప్పుడు ఆయన కూడా వీడియోలు చూడబోతున్నారని ఆర్కే ఒకరకంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ ఆ సీజేఐ బొద్దింకలు అన్నది ఎవరినో రాధాకృష్ణ చెప్పలేకపోయారు. బొద్దింకలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల వ్యవస్థ మీద నమ్మకం పోతుందని రాధాకృష్ణ గట్టిగానే చెప్పారు. అంతేకాదు మీడియా వ్యవస్థను కూడా రాధాకృష్ణ ప్రశ్నించారు. ఒకసారి బొద్దింకలకు ప్రాధాన్యం ఇవ్వలేదని.. మరొకసారి గోడి మీడియా అంటూ విమర్శిస్తున్నారని రాధాకృష్ణ బాధపడ్డారు.. అన్న హజారే ఉద్యమం చేస్తున్నప్పుడు మీడియాకు స్వేచ్ఛ ఉందట.. ఇప్పుడు మాత్రం స్వేచ్ఛ లేదట.. ఆ స్థాయిలో స్వేచ్ఛ లేకపోతే రాధాకృష్ణ ఇలా ఎలా రాయగలుగుతారు.. తన పత్రికలో కాక్రోచ్ ఉద్యమానికి అంత స్పేస్ ఎలా ఇవ్వగలరు..

మీడియా అధినేతలు రాజకీయ రంగులు పూసుకున్నారు కాబట్టి వాళ్లకు కాస్త ఒత్తిడి లాగా ఉంది. మీడియాను మీడియా లాగా ఉంచితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విషయాన్ని రాధాకృష్ణ మర్చిపోయారు. అన్నట్టు ఈ రాజ్యాంగం మీద.. ఈ దేశ వ్యవస్థల మీద ప్రజలకు ఇప్పటికీ బలమైన నమ్మకం ఉంది. అందువల్లే ఎన్ని శక్తులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ దేశం నిలబడుతూనే ఉంది. ఈ విషయాన్ని రాధాకృష్ణ మర్చిపోయారు. మొత్తానికి బొద్దింకల దృష్టిలో తాను గొప్పవాడినని చెప్పుకోవడానికి రాధాకృష్ణ ప్రయాసపడ్డారు గాని.. అసలు విషయాలను పక్కనపెట్టి.. తోచింది రాసుకుంటూ పోయారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
TDP MLA

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...
Newtons Third Law

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...
Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Oktelugu Epaper