Homeఆంధ్రప్రదేశ్‌RK Kotha Paluku: ఆర్కే కొత్త పలుకు.. నరేంద్ర మోడీని తిట్టలేడు.. అలాగని ఊరుకోలేడు.. పాపం...

RK Kotha Paluku: ఆర్కే కొత్త పలుకు.. నరేంద్ర మోడీని తిట్టలేడు.. అలాగని ఊరుకోలేడు.. పాపం వేమూరి రాధాకృష్ణ..

RK Kotha Paluku: వేమూరి రాధాకృష్ణ ప్రస్తుతం మంచి దూకుడు మీద కనిపిస్తున్నారు. గతంలో కొత్త పలుకు రాస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చారు అంటే ఇవ్వలేదు వచ్చింది అనేవారు. ఇప్పుడు గ్యాప్ ఇవ్వడం లేదు. ఆయన పెన్ను చకచగా రాసుకుంటూ పోతోంది.. ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం సంపాదకీయం లో ఒకటి బై మూడు వంతు ఆయన రాసిన రాతలు ప్రింట్ అవుతూనే ఉన్నాయి. వాటి ద్వారా కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.

రాధాకృష్ణ చెయ్యి తిరిగిన జర్నలిస్టు. రాష్ట్ర అంశాలు మాత్రమే కాకుండా.. జాతీయ అంశాల మీద కూడా పట్టు ఉంటుంది. అను సందర్భాల్లో ఆయన జర్నలిస్టు కాకపోవచ్చు గాని.. కొన్ని సందర్భాలలో మాత్రం తనను తాను జర్నలిస్టుగా ఆయన ప్రూవ్ చేసుకుంటారు. తాజాగా ఆదివారం ప్రచురితమైన కొత్త పలుకులో రాధాకృష్ణ పూర్తిస్థాయి జర్నలిస్టుగా మారిపోయారు. అవును.. చదువుతుంటే ఆశ్చర్యం అనిపించినప్పటికీ.. ఇది నిజం. రాధాకృష్ణ జర్నలిస్టుగా మారిపోయి వాస్తవాలను రాశారు. కాకపోతే ఇందులో కూడా ఒక రకమైన సంశయం ఉంది.

ప్రాంతీయ పార్టీలను బిజెపి మింగేస్తుందని.. మోడీషా దేశ రాజకీయాలను పూర్తిగా మార్చేస్తున్నారని.. దీనివల్ల రాజకీయాలలో విలువలు లేకుండా పోతున్నాయని రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేదన చెందారు. కొన్ని సందర్భాలలో బాధపడ్డారు. ఒక జర్నలిస్ట్ గా ఆయన ఇలాంటి భావాలను వ్యక్తికరించాల్సిందే. సమాజంలో జరుగుతున్న పరిణామాలను బయటపెట్టాల్సిందే. కానీ.. ఇక్కడే ఆయన టెంపో మిస్ అయింది. ఆయన అగ్రెసివ్నెస్ తగ్గిపోయింది..

నరేంద్ర మోడీ చేస్తున్న రాజసూయ యాగాన్ని ఒకవైపు రాధాకృష్ణ మెచ్చుకున్నారు. మరోవైపు ప్రాంతీయ పార్టీలలో జరుగుతున్న పరిణామాలను, ఆయా పార్టీల నాయకుల లోపాలను.. అవ లక్షణాలను బయటపెట్టారు రాధాకృష్ణ. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ నరేంద్ర మోడీని ఎందుకు విమర్శించలేదు.. భయమేసిందా.. ఏమైనా చేస్తారని అనిపించిందా.. ది గ్రేట్ జర్నలిస్ట్ రాధాకృష్ణకు ఇంత భయం ఎందుకు.. ప్రాంతీయ పార్టీలు తప్పు చేశాయి.. గతంలో పిరాయింపులకు పాల్పడి రాజ్యాంగాన్ని అవమానించాయి.. కానీ ఇదే తప్పును నరేంద్ర మోడీ ఎందుకు చేస్తున్నారు.. ఆయనకు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది.. ఇలా అవసరాల కోసం అడ్డగోలుగా పిరాయింపులకు పాల్పడితే.. బిజెపి ప్రజాస్వామ్యం గురించి ఎలా గొప్పగా చెబుతుంది.. రేపట్నాడు తనకే ఇటువంటి పరిస్థితి ఏదైతే ఏం చేస్తుంది.. పాపం ఈ ప్రశ్నలు రాధాకృష్ణ వేలకపోయాడు. గట్టిగా అడగాలనుకున్నాడు.. గట్టిగా రాద్దామనుకున్నాడు.. కానీ నిశ్శబ్దంగా.. ముగించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular