KCR and Revanth Reddy: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం(డిసెంబర్ 29న) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. రెండేళ్ల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్‌ఆవడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
పట్టుమని పది నిమిషాలు కూడా..
ఎప్పటి నుంచే కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరుతున్నారు. ఆయన అనుభవం చెప్పాలని, ప్రభుత్వానికి సూచనలు చేయాలని, సలహాలు ఇవ్వాలని పేర్కొంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. 2024లో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఆరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఉండి వెళ్లిపోయారు. తాజాగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఈ రోజు కూడా పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేదు.
ప్రతిపక్ష నేత వద్దకే సీఎం..
ఇక సాధారణంగా చట్టసభల్లో అందరూ సీఎంను కలుస్తారు. సభల్లో నమస్కరిస్తారు. కానీ, తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సముచిత గౌరవం ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అని భావించకుండా.. నేరుగా ప్రతిపక్ష నేతవద్దకు వెళ్లి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఆయన వెంట విప్ ఆది శ్రీనివాస్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం ప్రతిపక్ష నేత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.