Revanth Reddy : తెలంగాణలో ఎన్నికలు ముగిసినా రాజకీయ వేడి తగ్గడం లేదు. అసెంబ్లీతోపాటు అసెంబ్లీ బయట కూడా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్‌రావు ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, మంత్రులు కూడా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును టార్గెట్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదువుల్లో ఉండేవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడారు. ఇష్టానుసారం మాట్లాడడం కుదరదు. కానీ, దశాబ్ద కాలంగా నేతలు తమ పదవిని మార్చిపోయి చిల్లరగా మాట్లాడుతున్నారు. వ్యక్గిత ధూషణలకు దిగుతున్నారు. గతంలో కేసీఆర్ సీఎం హోదాలో విపక్ష నేతలపై ఇష్టానుసారం మాట్లాడేవారు. అహంకార పూరితంగా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేసేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మాటలు ఉద్యమానికి ఊపు తెచ్చాయి. కానీ, అధికారంలోకి వచ్చాక కూడా అదేరకమైన భాష మాట్లాడడం.. తెలంగాణలో ఇలాగే మాట్లాడతామని సమర్థించుకోవడం సమాజానికి నచ్చలేదు. చాలా మంది కేసీఆర్ భాషను వ్యతిరేకించారు. అయినా అదే పంథా కొనసాగంచారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి ఆయన భాష కూడా ఓ కారణమే. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ను సీఎం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు..
తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు కేటీఆర్. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై రాజీవ్‌గాంధీ జయంతి వేడుకల్లో రేవంత్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. అధికారం పోయినా కేటీఆర్‌కు బలుపు తగ్గలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ ఎదుట కేటీఆర్ వాళ్ల అయ్య (కేసీఆర్) విగ్రహం పెట్టాలనుకున్నాడని ఆరోపించారు. కేటీఆర్ అయ్య పోయేదెప్పుడు.. విగ్రహం పెట్టేది ఎప్పుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీది దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కుటుంబమని, దేశం కోసం రెండు తరాలు ప్రాణాలిచ్చిన కుటుంబమని చెప్పారు. అమరవీరుల స్తూపం పక్కన దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సముచితమన్నారు.
కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు..
ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే చెప్పులతో కొడుతామన్నారు. కేటీఆర్‌కు అధికారం కలలో కూడా రాదన్నారు. గత పదేళ్లలో సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదన్నారు. 2024, డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మా చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు రేవంత్‌రెడ్డి.
KTR wants to keep KCR’s idol. When will his father go & when will the idol come up? – CM Revanth Reddy lashes out at BRS infront of school kids
Telangana Talli statue will be kept inside secretariat
If you touch Rajiv Gandhi, we will hit you with slippers.
BRS is speaking… https://t.co/cZsiiTd03w pic.twitter.com/eWXZAX1MR1
— Naveena (@TheNaveena) August 20, 2024
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More