HomeతెలంగాణRevanth Reddy Shocking Comments: మీలో మీరు తన్నుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయండి!

Revanth Reddy Shocking Comments: మీలో మీరు తన్నుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయండి!

Revanth Reddy Shocking Comments: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. కవిత కొన్నిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు.. వ్యవహరిస్తున్న శైలి.. చినికి చినికి తుఫాన్‌గా మారింది. చివరకు కవితను బహిష్కరించే స్థాయికి చేరింది. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరణ తర్వాత కవిత హరీశ్‌రావు, సంతోష్‌రావు, సీఎం రేవంత్‌రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి నేతల వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని ఆరోపించారు. దీనిపై సీఎం స్పందించారు. ‘మీలో మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయండి.. మీ కుటుంబ కలహాల్లోకి మమ్మల్ని లాగొద్దు‘ అని రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ ఆధిపత్య పోరాటాలను ప్రజలపై రుద్దడంపై అసహనం వ్యక్తం చేశారు.

మీ గొడవలోకి లాగొద్దు..
‘మీలో మీరు కొట్టుకోండి.. మీ కుటుంబ కలహాల్లోకి మమ్మల్ని లాగొద్దు’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. చెత్త నాయకులైన హరీశ్‌రావు, సంతోష్‌రావు వెనుక తానెందుకు ఉంటానని ప్రశ్నించారు. తాను తెలంగాణను ముందు ఉండి నడిపిస్తున్నానని తెలిపారు. కవిత, కేటీఆర్, హరీశ్‌రావు పంపకాల్లో తేడా కారణంగానే గొడవలు పడుతున్నారని, చివరకు వీధిన పడ్డారని ఎద్దేవా చేశారు. కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు అని కవిత, కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి పేర్కొన్నారు. కవితకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించకపోవడం, ఆమె స్వతంత్ర కార్యక్రమాలకు దారితీసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలెన్నో..
ఇదిలా ఉంటే.. తాజాగా కవిత ప్రెస్‌మీట్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను నేరుగా కొన్ని ప్రశ్నలు వేశారు. 103 రోజులుగా ఎందుకు మాట్లాడడం లేదు. కుట్ర జరుగుతుందని చెప్పినా ఎందుకు స్పందించడం లేదు. కేసీఆర్‌పై సీబీఐ వేసినప్పుడు ప్రెస్‌మీట్‌ ఎందుకు పెట్టలేదు. హరీశ్‌రావు పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు సస్పెండ్‌ చేయరు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడినట్లు తెలిసినా ఎందుకు కొనసాగించారు. కేటీఆర్‌తోపాటు పలు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు హరీశ్‌రావు పనిచేసినా చర్యలు ఎందుకు లేవు ఇలా అనే ప్రశ్నలు వేశారు. వీటికి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version