3 Global films from Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కేవలం పాన్ ఇండియా కి మాత్రమే పరిమితం అయ్యింది అనుకుంటే పెద్ద పొరపాటే. ఇప్పుడు మన సినిమా బౌండరీలు దాటుకొని పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇదంతా రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన #RRR సినిమాతోనే సాధ్యమైంది అని చెప్పొచ్చు. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యాక పశ్చిమ దేశాల ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ముఖ్యంగా నాటు నాటు పాటకు ప్రపంచం మొత్తం ఊగింది. అందుకే ఆ పాటకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఎప్పుడైతే ఈ సినిమా ఆస్కార్ ఈవెంట్ లో హైలైట్ అయ్యిందో, ప్రపంచం లో ఉన్న మూవీ లవర్స్ చూపు మొత్తం మన టాలీవుడ్ వైపు మరలింది. మన మాస్ కమర్షియల్ సినిమాలను ఆదరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయబోతున్నాడు.
ఏకంగా 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రీసెంట్ గానే డిస్నీ మరియు సోనీ పిక్చర్స్ తో ఒప్పందం కూడా చేసుకున్నారట. అంటే ఈ చిత్రం కి వచ్చే వసూళ్లు హాలీవుడ్ సినిమాల ఓపెనింగ్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండబోతున్నాయి అన్నమాట. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండబోతుందట. ఈ మూవీ టీం కూడా డిస్నీ సంస్థ తో ఒప్పందం చేసుకోబోతున్నట్టు సమాచారం. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ క్యారక్టర్ చేస్తున్నాడు. దీపికా పదుకొనే(Deepika Padukone), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా రష్మిక(Rashmika Mandana) విలన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ముంబై లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గ్యాప్ లో లేకుండా జరుగుతుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండబోతుందట.
గమ్మత్తు ఏమిటంటే ఈ రెండు పాన్ వరల్డ్ సినిమాలు 2027 వ సంవత్సరం లోనే విడుదల కాబోతున్నాయట. అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు(Super Star Mahesh Babu) అభిమానులు ఇప్పటి నుండే ఈ రెండు సినిమాల కోసం సోషల్ మీడియాలో కొట్లాడుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు, నేచురల్ స్టార్ నాని(Natural Star Nani), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్'(The Paradise) అనే చిత్రాన్ని కూడా పాన్ వరల్డ్ స్పాన్ లోనే తెరకెక్కిస్తున్నారట. ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ తో చర్చలు జరిపి ఈ సినిమా ని కూడా పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇలా మన టాలీవుడ్ నుండి ప్రస్తుతం మూడు గ్లోబల్ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటిల్లో ఏ చిత్రం సెన్సేషన్ సృష్టించబోతోంది అనేది చూడాలి.