spot_img
HomeతెలంగాణRevanth Reddy controversial statement: బీఆర్‌ఎస్‌ చచ్చిపోయింది... సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy controversial statement: బీఆర్‌ఎస్‌ చచ్చిపోయింది… సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy controversial statement: ‘నేను చావాలని కోరుకుంటున్నరు.. కానీ బిడ్డా నేను చావ.. వెయ్యి జన్మలెత్తినా నేను చావ’ ఇటీవల జగిత్యాలలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలివి. కానీ తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం బీఆర్‌ఎస్‌ చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. చనిపోయిన పార్టీకి ఎంత అలంకరణ చేసినా ఏం లాభం అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ తనయ, మాజీ ఎమ్మెల్సీ కవిత పెట్టిన పార్టీపై రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కుటుంబం, పార్టీ ప్రజలతో దూరమయ్యారని, ఉన్న పార్టీకే దిక్కులేదని కొత్త పార్టీ ఎందుకని పరోక్షంగా కవిత పార్టీ గురించి వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ లేదు..
ప్రతీ పనికి ఒక పర్పస్‌ ఉంటుంది.. పని అయ్యాక దాంతో పని ఉండదు. బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ ఏర్పాటు కూడా ఒక పర్పస్‌ కోసం జరిగింది. ఆ పని ముగిసింది. ఇప్పుడు ఆ పార్టీతో పని లేదని నిర్ణయించారు. సీఎం రేవంత్‌ ప్రకారం, బీఆర్‌ఎస్‌ మనుగడ కోల్పోయిన ’చచ్చిన’ పార్టీ. శవాన్ని అలంకరించినా ఉపయోగం లేదని, దానికి గతం ఉండి భవిష్యత్‌ లేకపోవడాన్ని ఎత్తి చూపారు. కొత్త పార్టీ స్థాపనకు రాష్ట్రంలో స్థానం లేదని స్పష్టం చేశారు. ఈ పార్టీ అధికార దుక్కుల్లో అహంకారంతో పనిచేసి ప్రజల మద్దతును కోల్పోయిందని ఆరోపించారు.

ప్రజలకు దూరం..
రేవంత్‌ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌పై ప్రజల అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. పదేళ్ల అధికారంలో కేసీఆర్‌ కుటుంబం పార్టీని కుటుంబ వ్యవస్థగా మలిచి, ప్రజలతో బంధాలు బలహీనపరిచారని పేర్కొన్నారు. ఇక 2023 నుంచి తెలంగాణలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించానని రేవంత్‌ పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం బలాన్ని పెంచుతూ, విపక్షాలకు సవాలుగా మారింది. రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తులకు మార్గం ద్వారా మూసివేసినట్లు కనిపిస్తోంది.

సీఎం వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో అంతర్గత కలహాలను రేకెత్తిస్తాయి. కాంగ్రెస్‌ ఏకైక బలమైన శక్తిగా ఎదుగుతుందని రేవంత్‌ సంకేతం ఇచ్చారు. ఈ వ్యూహం ప్రజల మద్దతును మరింత బలోపేతం చేసి, విపక్షాల పునరుద్ధరణ అవకాశాలను తగ్గిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని రేవంత్‌ ఆశాభావంతో ఉన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version