Site icon OkTelugu

Dhanush shocking comments on Peddi: ‘పెద్ది ‘ మూవీ పై తమిళ హీరో ధనుష్ షాకింగ్ కామెంట్స్.. ఇది నిజంగా ఊహించి ఉండరు..

Dhanush shocking comments on Peddi

Dhanush shocking comments on Peddi

Dhanush shocking comments on Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీలు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ప్రమోషనల్ కంటెంట్ తో ఈ చిత్రం జనాల్లో క్రియేట్ చేసిన ఆసక్తి అలాంటిది మరి. అయితే అభిమానుల ఎదురు చూపులకు తగ్గట్టుగా ఈ చిత్రం విడుదల వెనక్కి వెళ్తూ ఉండడం తీవ్రమైన నిరాశకు గురి చేసే విషయమే. మార్చి 27 న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అవ్వాల్సిన సినిమా ఇది. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో మరింత ప్[ఎర్ఫెక్షన్ కోసం జూన్ నెలకి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ చిత్రం జూన్ 4 న విడుదల అవుతుందా ?, లేదంటే జూన్ 25 న విడుదల అవుతుందా అనేది పెద్ద ప్రశ్న.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం సినీ సెలబ్రిటీలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని నిన్ననే అర్థం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కారా’ ఈ నెల 30 న తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్భంగా , నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో పాటు, పెద్ది డైరెక్టర్ బుచ్చి బాబు కూడా ముఖ్య అతిథి గా విచ్చేశాడు. బుచ్చి బాబు గురించి ధనుష్ మాట్లాడుతూ ‘మీ పేరు తప్పుగా పలికి ఉండుంటే క్షమించండి సార్. షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. అది పూర్తి చేసుకొని మీరు నాకోసం ఇక్కడికి వచ్చారు , ధన్యవాదాలు సార్. మీ ‘పెద్ది’ కోసం నేను కూడా అందరిలాగానే ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని షేర్ చేస్తూ ‘పెద్ది’ కోసం అభిమానులు , ప్రేక్షకులు మాత్రమే కాదు , సినీ సెలెబ్రిటీలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతుంది. శృతి హాసన్, రామ్ చరణ్ లపై తెరకెక్కిస్తున్న ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ ఈ నెల 30 తో పూర్తి అవ్వబోతుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినట్టే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version