https://oktelugu.com/

Revanth Reddy : జైల్లో 16 రోజులు నరకం .. రేవంత్ ను కేసీఆర్ ఇంత టార్చర్ పెట్టాడా?

Revanth Reddy : భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని నాటి తెలంగాణ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు.

Written By: , Updated On : March 27, 2025 / 05:53 PM IST
Revanth Reddy in Assembly

Revanth Reddy in Assembly

Follow us on

Revanth Reddy : జైలు నుంచి విడుదలైన తర్వాత రేవంత్ రెడ్డి మరింత కసిగా పనిచేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అంతేకాదు వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. రాహుల్ గాంధీని, సోనియాగాంధీని, ప్రియాంక గాంధీని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి.. డిక్లరేషన్లు ప్రకటించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అంతే కాదు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన తప్పులను పదేపదే ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.. వివిధ సామాజిక మాధ్యమాలు, ప్రసారమాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కాగలిగారు. కెసిఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో నిరుద్యోగ సభ పెట్టి.. తన సత్తా ఏమిటో చూపించారు రేవంత్ రెడ్డి. అంతేకాదు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేయగా.. ఆయనకు ప్రతిగా రేవంత్ రెడ్డి పోటీ చేశారు. కామారెడ్డిలో కెసిఆర్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. ఇక ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో.. అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీలో పోటీ ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపించింది.

Also Read : కొడంగల్ లో రేవంత్ గెలవడు.. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావు

ఇబ్బంది పెట్టారా?

రేవంత్ రెడ్డి ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు అప్పటి కెసిఆర్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.. 2018 లో జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిని తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. చివరికి రేవంత్ రెడ్డి ఓటమికి కారణమైంది. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రేవంత్ రెడ్డి విషయంలో ఏమాత్రం ఉదారత చూపించలేదు. అప్పట్లో కేటీఆర్ కు జన్వాడ లో ఫామ్ హౌస్ ఉందని వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని తెలంగాణ సమాజం ముందు పెట్టడానికి రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేశారని ప్రచారం జరిగింది. దాన్ని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించింది. నాడు పోలీసుల చేతిలో అరెస్టుకు గురైన రేవంత్ రెడ్డి జైలు శిక్ష అనుభవించారు. జైలు శిక్ష సమయంలో రేవంత్ రెడ్డిని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మళ్లీ ఇంత కాలానికి రేవంత్ రెడ్డి నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ వేదికగా ఆ విషయాలను వెల్లడించారు. ” డ్రోన్ ఎగరవేసినందుకు 500 రూపాయల అపరాధ రుసుము విధించాలి. కానీ నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మామూలుగా అయితే ఒక నిందితుడికి ఏడు సంవత్సరాల లోపల శిక్ష ఉంటే రిమాండ్ విధించకుండా బెయిల్ ఇవ్వాలి. కానీ నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ పెద్దలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నన్ను చర్లపల్లి జైలుకు పంపించారు. నక్సలైట్లు, తీవ్రవాదులు శిక్ష అనుభవించే డి టెన్షన్ లో నన్ను వేశారు. 16 రోజులపాటు ఒక్క మనిషిని కూడా చూడనీయకుండా నన్ను నిర్బంధించారు. ఆ కోపాన్ని నేను దిగ మింగుకొని.. రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నా. నన్ను పడుకొనివ్వకుండా రాత్రి మొత్తం ట్యూబ్ లైట్ లు వేసి ఉంచేవారు.. 20 నుంచి 30 పెద్ద బల్లులు పురుగులు తింటుంటే ఒక్కరోజు కూడా నేను నిద్రపోలేదు. నేను ఉండే సెల్లో చిన్న బాత్రూం లో కూర్చుంటే బయటకు కనిపించే విధంగా ఉంటుంది. కావాలంటే ఈ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులను తీసుకువెళ్లి చూపిస్తా. 16 రోజులు నిద్ర లేకుండా నరకం చూసాను. ఉదయం బయటికి వచ్చి చెట్టు కింద పడుకునేవాడినని” రేవంత్ రెడ్డి నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

Also Read : చెరో పదేళ్లు అధికారం.. కేటీఆర్ తో అసెంబ్లీలో కోమటిరెడ్డి డీల్!