Veera Dheere Soora
Veera Dheere Soora : చాలా కాలం నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోలలో ఒకరు చియాన్ విక్రమ్(Chiyaan Vikram). ఒకప్పుడు తమిళనాడు లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో తిరుగులేని మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ హీరోకు, ఈమధ్య కాలంలో కనీసం యావరేజ్ రేంజ్ సినిమా కూడా దొరకడం లేదు. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘తంగలాన్’ కి కూడా సరైన రెస్పాన్స్ రాలేదు. ఈ చిత్రం తర్వాత ఆయన ‘వీర ధీర సూర 2′(Veera Dheera Sura 2) అనే చిత్రం చేశాడు. మొదటి భాగం విడుదల కాకముందే రెండవ భాగాన్ని విడుదల చేసి సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. నేడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలై యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కానీ ఓపెనింగ్ వసూళ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. గంటకు కనీసం 3 వేల టిక్కెట్లు కూడా అమ్ముడుపోవడం లేదు.
Also Read : మహేశ్- రాజమౌళి కాంబోలో విలన్గా స్టార్ హీరో!
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు విడుదల సమయంలో చాలా గట్టి ఎదురు దెబ్బనే తగిలింది. హైకోర్టు విడుదలను ఆపివేయాలని ఆదేశాలు ఇవ్వడం తో నేడు ఉదయానికి షెడ్యూల్ చేసిన 9 గంటల షోస్ మొత్తం రద్దు అయ్యాయి, అదే విధంగా ఓవర్సీస్ లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోస్ ని కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అసలే తక్కువ ఓపెనింగ్స్ వస్తుందని అనుకుంటే, ఇలా షెడ్యూల్ చేసిన షోస్ అన్ని క్యాన్సిల్ చేయడం వల్ల భారీ దెబ్బ తగిలింది. అందుకు కారణం ఏమిటంటే ఈ చిత్రం నిర్మాణం లో ‘B4U’ సంస్థ పెట్టుబడులు పెట్టింది. అలా పెట్టుబడులు పెట్టినందుకు బదులుగా ఓటీటీ రైట్స్ ని దక్కించుకున్నారు. కానీ నిర్మాతలు ఓటీటీ రైట్స్ ని అమ్మేసి, డబ్బులు పోగు చేసుకున్నారు కానీ, ఒప్పందం ప్రకారం ‘B4U’ సంస్థకు డబ్బులు ఇవ్వలేదు.
దీంతో ఆ నిర్మాణ సంస్థ కోర్టుకెక్కింది. ఈ సినిమా నిర్మాణం లో భాగం అయ్యినందుకు ఓటీటీ ద్వారా వచ్చే డబ్బులను మొత్తం తమకు ఇస్తామని మాట ఇచ్చి, ఇప్పుడు తప్పుతున్నారని, తక్షణమే ఈ సినిమా విడుదలను ఆపేయాలని పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ జరిపిన హై కోర్టు, సినిమా విడుదలను ఆపాలంటూ స్టే ఆర్డర్ విధించింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్, స్పెషల్ షోస్ మొత్తం రద్దు అయ్యాయి. ఎట్టకేలకు ఆ ఫైనాన్షియల్ లావాదేవీలు మేకర్స్ పూర్తి చేయడంతో, మధ్యాహ్నం షోస్ నుండి ప్రదర్శించుకోవడానికి కోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే ఈ సినిమా వచ్చిన రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ట్రైలర్ ని చూసి విక్రమ్ లోని మాస్ యాంగిల్ ని మరోసారి బయటకు తీశారు, కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది ఈ చిత్రం.
Also Read : 4 కోట్లు పెట్టి కొన్నారు..వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు