https://oktelugu.com/

Union Minister Bandi Sanjay : నువ్వే నాకు క్షమాపణ చెప్పాలి.. కేటీఆర్‌ నోటీసులకు ‘బండి’ మాస్‌ రిప్లై!

తనపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించారు. దీనిపై బండి సంజయ్‌ తాజాగా స్పందించారు. తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 29, 2024 / 02:20 PM IST

    Union Minister Bandi Sanjay

    Follow us on

    Union Minister Bandi Sanjay : తెలంగాణ మాజీ మంత్రి, గులాబీ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారాక రామారావు తనపై ఎవరు ఆరోపణలు చేసినతా తట్టుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాధారణం. వాటిని తట్టుకుని నిలబడేవారే రాజకీయాల్లో ఎక్కువ. లేదంటే సినీ నటుడు చిరంజీవిలా రాజకీయాల నుంచి తప్పకుంటారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాత్రం తానా రాజకీయాల్లో ఉంటూనే తనను ఎవరూ ఏమీ అనొద్దని కోరుకుంటున్నారు. తాను తప్పు చేసినా.. ఒప్పు చేసినా పట్టించుకోవద్దన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ఆయన ఎవరైనా తనపై ఆరోపణలు చేసినా.. విమర్శలు చేసినా తట్టుకోలేకపోతున్నారు. లీగల్‌ నోటీసులు, పరువునష్టం దావాలు వేస్తున్నారు. అధికారం కోల్పయాక నోటీసుల స్పీడ్‌ పెంచారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లీగల్‌ నోటీసులు పంపించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ నోటీసులపై బండి సంజయ్‌ స్పందించారు.

    నాకే క్షమాపణ చెప్పాలి..
    కేటీఆర్‌ లీగల్‌ నోటీసులపై స్పందించిన సంజయ్‌.. తాను పంపిన సమాధానంతో తనదైన శైలిలో రిప్లయ్‌ ఇచ్చారు. నోటీసుల్లో ఆరోపణలను ఖండించారు. తనపై చేసిన వారోపణలు అబద్ధం, నిరాధారమని పేర్కొన్నారు. తన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్‌ పేరును ఎక్కడ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు కేటీఆర్‌ మీడియా ద్వారా తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లీగల్‌ నోటీసును వారం రోజుల్లో ఉప సంహరించుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ అధికాంలో ఉన్నప్పుడు డ్రగ్స్‌ సేవించి, ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని తప్పుడు, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యానించారని కేటీఆర్‌ అక్టోబర్‌ 23న బండి సంజయ్‌కు లీగల్‌ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

    తాటాకు చప్పుళ్లకు భయపడను..
    లీగల్‌ నోటీసులకు స్పందించి భేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్‌ తన లీగల్‌ నోటీసుల్లో హెచ్చరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల నుంచి తప్పించుకోవడానికి సీఉం రేవంత్‌రెడ్డితో రహస్యంగా కలిసిపోయానని నిరూపించాలని డిమాండ్‌ చేశారు. దీనిపైనా సంజయ్‌ స్పందించారు. తాటాకు చప్పుల్లకు బయపడనని స్పష్టం చేశారు.