spot_img
HomeతెలంగాణRavi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ప్రారంభంలో అది చిన్న నీటి కొలను మాత్రమే. నేడు దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ సంస్థలలో ముందు వరుసలో స్థానం సంపాదించుకుంది. అంతటి తన సంస్థ నుంచి రవి ప్రకాష్ అవమానకరంగా బయటికి వచ్చేసాడు. కేసులు కూడా ఎదుర్కొన్నాడు. సహజంగానే అతడిలో టెంపర్మెంట్ ఎక్కువ. పైగా మీడియా బిజినెస్ ఎలా చేయాలో బాగా తెలుసు.

రివెంజ్ తీర్చుకోవాలి. టీవీ9 ను తొక్కేయాలి. అలాగని భారీగా ఖర్చు పెట్టొద్దు. విస్తృతమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి.. తనకంటూ సొంత మేనరిజాన్ని మళ్ళీ సృష్టించుకోవాలి. సరిగా ఇక్కడే డిజిటల్ మీడియా వైపు వెళ్లిపోయాడు రవి ప్రకాష్. ఆర్ టి వి పేరుతో వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఇన్వెస్టర్లను పట్టుకొచ్చాడు. తన పేరే ఒక బ్రాండ్ అనుకుంటూ మళ్లీ తెర ముందుకు వచ్చాడు. రంగు పూసుకున్నాడు. ఉన్నది ఉన్నట్టు లేదు కనికట్టు అన్నట్టుగా చెప్పడం మొదలుపెట్టాడు. మీడియా వ్యాపారాలు ఎలా చేయాలో తెలుసు కాబట్టి.. రవి ప్రకాష్ పెద్దగా ఇబ్బంది పడలేదు.

ఇప్పుడు ఏకంగా టీవీ9 ను కొట్టేశాడు రవి ప్రకాష్. వియర్ షిప్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాలలో రవి ప్రకాష్ ఆర్ టి వి ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్ సాధించింది. తాజాగా నీట్ ఆందోళనల కవరేజ్ లోను మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఎన్నికల కవరేజ్ లో టీవీ నైన్ 11 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. నీట్ కవరేజ్ విషయంలో కూడా అంతంత మాత్రమే వీక్షణలు దక్కించుకుంది. ఇక మిగతా ఎన్ టీవీ.. బిగ్ టీవీ.. ఏబీఎన్.. వి6 తర్వాత స్థానంలో ఉన్నాయి. తెలంగాణ గుండె చప్పుడుగా చెప్పుకునే టీ న్యూస్ జాబితాలో లేదు. ఇక మిగతా వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

కంటెంట్ విషయంలో రవి ప్రకాష్ రాజీపడటం లేదు. పైగా తానే కెమెరా ముందుకు వస్తున్నాడు. రీల్స్ చేస్తున్నాడు. తనకున్న సమాచారాన్ని బ్లాస్టింగ్ మోడల్ లో ఇచ్చేస్తున్నాడు. ఆర్ టివి టీవీ9 కు సవాల్ విసురుతోంది. మామూలు ఖర్చుతో.. పరిమితమైన నెట్వర్క్ తో అదరగొడుతోంది. మరి రవి ప్రకాష్ దూకుడుకు.. రజనీకాంత్ ఎలాంటి విరుగుడు మంత్రం కనిపెడతాడో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Spirit Movie

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...
Chiranjeevi And Pawan Kalyan

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...
Spain Royal Family

Spain Royal Family: స్పెయిన్‌ రాజవంశంలో కొత్త యుగం… 20 ఏళ్లకే సింహాసనం ఎక్కిన రాణి!

Spain Royal Family: స్పెయిన్‌ యూరప్‌లో చిన్న దేశం. ఇటీవల ఇరాన్‌ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం అమెరికా తీరును తప్పు పట్టింది. సైనిక స్థావరం ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వలేదు. వందల ఏళ్ల...
Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Oktelugu Epaper