Ration Card KYC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులపై ఏదైతే గడువు విధించింది. ఏప్రిల్ 30లోగా ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేయించుకోవాలని.. లేకపోతే అందులో పేర్లు పూర్తిగా తీసేయాల్సి వస్తుందని తెలిపింది. రేషన్ కార్డులో పేరు లేకపోతే ప్రభుత్వ పథకాలు నిలిచిపోయే అవకాశం ఉందని.. అందువల్ల ఈ కేవైసీను వెంటనే చేయించుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే చాలామంది ఈ కేవైసీ చేయించుకోవడానికి రేషన్ షాప్ లముందు బారు లు తీరుతున్నారు. అయితే రేషన్ కార్డు ఉన్నవారు అందరూ ఈకే వయసుని నమోదు చేసుకోవాలని పేర్కొంది.
Also Read: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. రెండు దేశాల్లోని కీలక పరిణామాలు ఇవీ
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డు లో ఉన్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో చాలామంది ఈ కేవైసీని పూర్తి చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో గతంలో మార్చి 31 వరకు గడువు విధించారు. అయితే వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు తమ సొంత ప్రాంతాలకు రావడానికి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో మరోసారి గడువును పెంచారు. అయితే ఈ గడువు ఏప్రిల్ 30తో ముగుస్తుంది. ఆ తర్వాత మరోసారి గడువు పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ 30 వరకు ఎవరైనా రేషన్ కార్డు షాపుల్లో పీకే వయసుని పూర్తి చేసుకోవాలని ప్రభుత్వాధికారులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు ఆధారంగానే లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. రేషన్ కార్డులో పేరు ఉంటేనే ఆయా ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం ఉంటుంది. ఇందులో పేరు లేకపోతే కష్టంగా మారుతుంది. అయితే చాలామంది ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి రేషన్ షాపుల ముందు బారులు తీరినప్పటికీ.. సాంకేతిక కారణాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు ఈపాస్ యంత్రాల్లో సమస్యలు ఏర్పడితే వేలిముద్రలను వేయించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో పనిచేసేవారు.. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వారికి కూడా ఈ అవకాశాన్ని ఇచ్చారు.
2020లో చాలామంది రేషన్ కార్డును పొందారు. అప్పటినుంచి ఈ కేవైసీని పూర్తి చేసుకోలేదు. అయితే ప్రస్తుతం ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు? ఎంతమంది లేరు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నిజమైన లబ్ధిదారులు ఎవరో తెలిసిపోతుంది. ఇలా నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించాలని రేషన్ కార్డు ఈ కేవైసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న గడువును మరోసారి పెంచే అవకాశం లేనందున.. అలాగే ఏప్రిల్ 30 చివరి తేదీ అయినందున.. ఈరోజు అయినా తమ ఈ కేవైసీను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.