Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతారు. అయితే బంగారం కొనడానికి అందరూ వద్ద ఆదాయం ఉండదు. బంగారం కొనుగోలు చేస్తే ఇలా సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని కొందరి నమ్మకం. ఈ క్రమంలో బంగారానికి బదులు ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చని కొందరు ఆధ్యాత్మికవాదులు తెలుపుతున్నారు. ఈ వస్తువులు కొన్న లక్ష్మీదేవి కరుణిస్తుంది అని పేర్కొంటున్నారు. అయితే ఆయా రాశి ప్రకారం వస్తువులు కొనుగోలు చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇంతకీ ఏ రాశి వారు ఏ వస్తువులు కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
Also Read: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. రెండు దేశాల్లోని కీలక పరిణామాలు ఇవీ
మేష రాశి వారికి అధిపతి కుజుడు.. అందువల్ల ఈ రాశి వారు రాఖీ పాత్రలు కొనుగోలు చేయవచ్చు. ఈ వస్తువులు కొనడం వల్ల వారు అనుకున్న పనులు నెరవేరుతాయి. అయితే నలుపు రంగు వస్తువులను కొనుగోలు చేయరాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
వృషభ రాశి వారు బియ్యంతో పాటు మినుములు ఆవులు కొనుగోలు చేయాలని అంటున్నారు. అయితే ఈరోజు గోదానం చేస్తే ఇప్పటివరకు ఉన్న కష్టాలని తొలగిపోతాయని అంటున్నారు. నీలం రంగుతోపాటు తెల్లటి వస్తువులను కొనుగోలు చేయడం వీరికి శుభప్రదం అని అంటున్నారు.
మిథున రాశి వారు అక్షయ తృతీయ రోజున పచ్చ రంగు కలిగిన వస్తువులు కొనుగోలు చేయాలని అంటున్నారు. అయితే వీరు ఈరోజు సాంకేతిక రంగానికి చెందిన వి కొనుగోలు చేయవచ్చు.
కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. మీరు ఈ రోజున పసుపు కలరు లేదా క్రీమ్ కలర్ కలిగిన వస్తువులను కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే వీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు.
సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు అయినందున వీరు కూడా మేషరాశి వలె రాగి వస్తువులను కొనుగోలు చేయాలి. అయితే బూడిద రంగుర వస్తువులను కొనుగోలు చేసిన మంచి ఫలితాలే ఉంటాయి.
కన్యా రాశి వారు అక్షయ తృతీయ రోజున తులసి మొక్కను పూజించాలి. ఇతరులకు తోటకూరను ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది.
తులా రాశి వారు ఈ రోజు నీలం లేదా తెల్లటి వస్తువులను కొనుగోలు చేయాలి. ఇతరులకు ఆకుకూరలను దానంగా ఇవ్వడం వల్ల ఐశ్వర్యం పెరిగే అవకాశం ఉందని పండితులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి వారు అక్షయ తృతీయ రోజున తెలుపు రంగు వస్తువులను వాడాలి. అలాగే పేదలకు వస్త్ర దానం చేయడం వల్ల ఆదాయం పెరుగుతుందని అంటున్నారు.
ధనుస్సు రాశి వారు ఇత్తడి పాత్రను కొనుగోలు చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుందని అంటున్నారు. అలాగే ఈరోజు నారింజ కలర్ వస్తువులను కొనుగోలు చేయాలని అంటున్నారు.
మకర రాశి వారికి అక్షయ తృతీయ రోజున తెలుపు నీలం బూడిద రంగు వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కలిసి వస్తుంది. అలాగే వీరికి శని దేవుడు అధిపతి అయినందున నల్ల నువ్వులను దానం ఇవ్వాలి.
కుంభరాశి వారి కి కూడా శని దేవుడే అధిపతి. అందువల్ల వీరు బ్లాక్ లేదా సిల్వర్ కలర్ వస్తువులను ఉపయోగించాలి.
మీన రాశి వారికి ఈ రోజు పసుపు లేదా తెల్లటి కలరు వస్తువులను ఉపయోగించడం లేదా కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చని అంటున్నారు.