US India Relations: దోస్త్.. ఫ్రెండ్.. ఫ్రెండ్లీ కంట్రీ.. గుడ్ బిజినెస్ పార్ట్నర్.. అంటే ఇన్నాళ్లూ ప్రధాని మోదీని, భారత దేశాన్ని ఆకాశానికి ఎత్తేసిన అమెరికా అధ్యక్షుడు.. ఇప్పుడు అవసరం తీరాక తన నిజ స్వరూం బయట పెడుతున్నాడు. ఇప్పటికే అమెరికా కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని హుకూం జారీ చేశారు. ఇప్పుడు భారత్‌తో వ్యాపారం బాగా సాగడం లేదని 25 శాతం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని మరో 25 శాతం టారిఫ్‌లు విధించారు. ట్రంప్ దుందుడుకు చర్యలు భారత్ కన్నా అమెరికాకే ఎక్కువ నష్టం కలిగిస్తాయని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లు విధించి తప్పు చేశారని అమెరికాలోనే చాలా మంది ఆర్థిక వేత్తలు, మాజీ మంత్రుల, ఉపాధ్యక్షులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అమెరికాకే నష్టం ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు. భారత్, సౌత్ కొరియా, జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలపై అధిక సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో కలకలం రేపింది. భారత్‌పై 50% సుంకాలు విధించడం, రష్యాతో వాణిజ్య సంబంధాల కారణంగా అదనపు 25% జరిమానా సుంకం విధించడం ద్వారా ట్రంప్ భారత్‌ను ఒత్తిడి చేయాలని చూశారు. కానీ అంతర్జాతీయ లక్ష్యాల సాధనలో ట్రంప్ విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. భారత్ ఈ సుంకాలను నిరసిస్తూ, రష్యాతో వాణిజ్యాన్ని పెంచుకుంటూ దఢమైన వైఖరిని కొనసాగిస్తోంది.
Also Read: ట్రంపు టారిఫ్ దెబ్బ.. అల్లాడిపోతున్న అమెరికన్స్
అసలు ట్రంప్ ఉద్దేశం ఏమిటి?
ట్రంప్ భారత్‌పై 50% సుంకాలు విధించడానికి ప్రధాన కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులను పేర్కొన్నారు. ఈ సుంకాల ద్వారా భారత్‌ను ఒత్తిడి చేసి, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు లొంగమని ఒత్తిడి చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, భారత్ ఈ సుంకాలను లెక్కలోకి తీసుకోకుండా, రష్యాతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించి, ఎస్–30 విమానాల కొనుగోలు ఒప్పందంపై చర్చలు జరిపారు. ఈ వైఖరి ట్రంప్ ఆశించిన ఫలితాలకు విరుద్ధంగా ఉంది. భారత్ యొక్క ఈ స్వతంత్ర వైఖరి ట్రంప్ విధానాలను సవాలు చేస్తోంది, ఇది అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వేదికలపై భారత్ యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని చూపిస్తోంది.
అమెరికన్లపైనే టారిఫ్‌ల భారం..
ట్రంప్ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడం, వాణిజ్య లోటును తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఈ సుంకాల భారం అమెరికన్ వినియోగదారులపైనే పడుతోంది. భారత్ నుంచి అమెరికాకు సుమారు 78 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా, అమెరికా నుంచి భారత్‌కు సుమారు 50 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. 50% సుంకాల వల్ల అమెరికన్ వినియోగదారులు దిగుమతి వస్తువులపై 25% ధరల పెరుగుదలను ఇప్పటికే ఎదుర్కొంటున్నారు, ఆగస్టు 27 నుంచి మరో 25% ధరలు పెరగనున్నాయి. ఫోర్డ్ కంపెనీపై ఇప్పటికే 800 మిలియన్ డాలర్ల టారిఫ్ భారం పడింది, ఇది వినియోగదారులకు బదిలీ అవుతుంది. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ టారిఫ్‌లు అమెరికా మధ్యతరగతి ప్రజలను నష్టపరుస్తాయని హెచ్చరించారు. సుప్రసిద్ధ ఆర్థికవేత్త వోగ్ గూగుల్‌మ్యాన్ కూడా ట్రంప్ విధానాలను విమర్శించారు, ఈ సుంకాలు ద్రవ్యోల్బణాన్ని పెంచి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తాయని పేర్కొన్నారు. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికన్ కుటుంబాలు సగటున 3 వేల డాలర్ల అదనపు ఖర్చును భరించాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
అమెరికాలోనే విమర్శలు..
ట్రంప్ టారిఫ్‌లు అమెరికాలోని రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల నుంచి కూడా విమర్శలను ఎదుర్కొంటున్నాయి. మాజీ హౌస్ స్పీకర్ పాల్ రయాన్ ఈ సుంకాలను ‘‘చిత్తశుద్ధి లేని నిర్ణయాలు’’గా విమర్శించారు. ఈ టారిఫ్‌లు 1977 చట్టం ఆధారంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి పేరుతో విధించబడ్డాయి, దీనిపై న్యాయస్థానంలో సవాలు ఉంది. ట్రంప్ స్వయంగా న్యాయస్థానం తన నిర్ణయాలను రద్దు చేస్తే 1929 నాటి ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితి వస్తుందని హెచ్చరించారు, ఇది విమర్శకులు భయపెట్టే వ్యూహంగా భావిస్తున్నారు. మాజీ మంత్రి కట్ క్యాంపెన్ ఈ టారిఫ్‌ల వల్ల అమెరికన్ ఆర్థిక వ్యవస్థనే నష్టపోతుందని పేర్కొన్నారు. దిగుమతి సుంకాలు అమెరికన్ కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది, ఈ భారం చివరికి వినియోగదారులపైనే పడుతుంది. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో ఉపాధి తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం, గహ విలువలు తగ్గడం వంటి సమస్యలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
Also Read: ట్రంప్ – పుతిన్ మీటింగ్ షురూ! జరగబోయే పరిణామాలు ఏంటి ?
భారత్ స్వతంత్ర వైఖరి..
భారత్ ట్రంప్ టారిఫ్‌లకు లొంగకుండా, రష్యాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తూ, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోంది. మాజీ భారత రాయబారి మీరా శంకర్, అమెరికా విధించిన సుంకాలను భారత్ ‘‘బెదిరింపులకు లొంగదు’’ అని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాలు ట్రంప్ యొక్క ఆధిపత్య వైఖరిని ఖండిస్తూ, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చాయి. భారత్, బ్రెజిల్ నాయకులు ఈ సుంకాలకు వ్యతిరేకంగా ఏకమై, అంతర్జాతీయ వేదికలలో సహకారాన్ని పెంచుకుంటున్నారు. భారత్ రష్యాతో చమురు దిగుమతులను కొనసాగిస్తూ, ఎస్–30 విమానాల కొనుగోలు వంటి రక్షణ ఒప్పందాలను ముందుకు తీసుకెళ్తోంది. ఈ వైఖరి ట్రంప్ యొక్క ఒత్తిడి వ్యూహాన్ని విఫలం చేస్తోంది, అదే సమయంలో భారత్ యొక్క ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రాన్ని ప్రపంచానికి చాటుతోంది. ట్రంప్ మాత్రం తన గొయ్యి తానే తవ్వుకుంటోది. ట్రంప్ హస్తం అమెరికన్ల పాలిట భస్మాసుర హస్తం కాబోతోంది..!