HomeతెలంగాణArmoor MLA: తులం బంగారం పంచాయితీ.. కాంగ్రెస్ నేతల మెడలోని బంగారం గోవిందా.. సంచలన పిలుపు

Armoor MLA: తులం బంగారం పంచాయితీ.. కాంగ్రెస్ నేతల మెడలోని బంగారం గోవిందా.. సంచలన పిలుపు

Armoor MLA: తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుంచి రాకేష్ రెడ్డి 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీ మేరకు మూడువేల గృహాలు నిర్మించి ఇచ్చారు.

తన నియోజవర్గంలో పేదలు ఎక్కువగా ఉన్నారని.. వారిలో చాలామందికి గృహాలు లేవని ఆయన అప్పట్లో చెప్పారు. తన సొంత ఖర్చులతో గృహాలు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఇచ్చిన హామీకి తగ్గట్టుగానే కేంద్ర పథకం ద్వారా ఆయన సుమారు 3000 మంది లబ్ధిదారులకు గృహాలను కట్టించి ఇచ్చారు.. ఆర్మూరు నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రకటిస్తున్నారు. గులాబీ పార్టీ నాయకులకు.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏకకాలంలో గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.

2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తుల బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ రాకేష్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బంగారం ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకుల మెడలో నుంచి బంగారాన్ని తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకవేళ పోలీసులు కేసులు పెడితే తన వద్దకు రావాలని ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు గృహాలు కట్టించి ఇవ్వకపోతే.. తన సొంత ఖర్చులతో ఇల్లు కట్టిస్తానన్న హామీ మేరకు నియోజవర్గంలో 3000 మంది పేదలకు గృహాలు కట్టించి ఇచ్చినట్టు రాకేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.. కొద్దిరోజులుగా ఆర్మూర్లో రాజకీయంగా రకరకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాకేష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని గులాబీ పార్టీ నాయకులు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ విమర్శలకు ఇప్పటికే రాకేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల మెడలో ఉన్న బంగారాన్ని గుంజుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఇటీవల కాలంలో రాకేష్ రెడ్డి తరచుగా వివాదాస్పద వ్యక్తులు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ నాయకుల మెడలో నుంచి బంగారాన్ని లాక్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసులు పెడితే తన వద్దకు రావాలని కూడా సూచించారు. ఈ ప్రకారం నియోజకవర్గం లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Oktelugu Epaper
Exit mobile version