https://oktelugu.com/

Rajinikanth Coolie films : రజినీకాంత్ చేస్తున్న కూలీ సినిమాలో ఒకప్పటి భాషా సినిమా డైలాగ్స్ ను వాడుతున్నారా..?

ప్రస్తుతం చాలామంది హీరోలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు. ఇక అందులో భాగంగానే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా మరోసారి తనను తాను పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన కొన్ని సినిమాలు పాన్ ఇండియాలో సక్సెస్ ని సాధించడంలో వెనుకబడ్డాయి...

Written By:
  • Gopi
  • , Updated On : October 16, 2024 / 02:10 PM IST

    Are Rajinikanth's Coolie films using old language film dialogues?

    Follow us on

    Rajinikanth Coolie films : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి స్టార్ హీరోకి చాలా మంచి గుర్తింపు ఉంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో భారీ సక్సెస్ ను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన చాలావరకు సక్సెస్ అయ్యాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఇప్పటికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఆయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న కూలీ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆశించిన మేరకు విజయం అయితే సాధించలేకపోయింది. కాబట్టి ఇప్పుడు చేయబోయే సినిమా మీదనే ఆయన భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు. ఇక అందుకోసమే కూలీ సినిమాలో రజినీకాంత్ వింటేజ్ లుక్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లోకేష్ కనకరాజ్ సినిమా అంటే ఆ హీరో తాలూకు వింటేజ్ లుక్ ను చూపిస్తూనే అందులోనే హై ఎలివేషన్స్, ఎమోషన్స్ ను క్యారీ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటాడు. కాబట్టి ఆయన లాంటి దర్శకుడు రజనీకాంత్ ను సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడు అనేది కూడా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు దాని కోసమే రజనీకాంత్ ఒకప్పుడు చేసిన భాషా సినిమాలో ఉండాల్సిన కొన్ని డైలాగ్స్ ను వాడుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక వీలైతే మరి కొన్ని సీన్లను కూడా ఆ సినిమాలో నుంచి తీసుకొని మరి లోకేష్ కనకరాజ్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ చాలామంది సినీ విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిలో ఏదో ఒక వైవిధ్యం అయితే సంతరించుకుంటూ ఉంటుందనేది మొదటి నుంచి కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు.

    అందువల్ల ఇప్పుడు చేస్తున్న సినిమా విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇక కూలీ సినిమా భారీ సక్సెస్ సాధించాలనే దిశగా ఆ సినిమాని నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక విక్రమ్ సినిమాతో ఆయన ఒక్కసారిగా పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. అలాగే లోకేష్ యూనివర్స్ లో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు…

    ఇక కూలీ సినిమాలో రజినీకాంత్ ను ఎదుర్కొనే క్యారెక్టర్ లో నాగార్జున ను తీసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు నాగార్జున ఏ సినిమాలో కూడా విలన్ గా చేయలేదు. మరి నాగ్ ఈ సినిమాతో విలన్ గా రాణిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే లోకేష్ చేస్తున్న సినిమా లకు ఇప్పటికే పాన్ ఇండియా లో భారీ మార్కెట్ అయితే ఉంది…