Raja Singh Exposing BJP Secrets: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన తరువాత ఆ ఎపిసోడ్ పూర్తయ్యిందని అందరూ భావించారు. కానీ బీజేపీలో ఒక కొత్త డ్రామాకు తెరలేచింది. రాజాసింగ్ రాజీనామా విషయంలో పునరాలోచించాలని ఆ పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఆయనతో ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ బీజేపీ లో మరో చర్చకు దారితీసింది. ఆయన పార్టీలో ఉంటేనే బాగుంటుందని కొంతమంది నాయకులు భావిస్తున్నట్లు వారి అంతరంగాన్ని ఆ ఆడియో క్లిప్ ద్వారా బహిరంగపరచినట్లు తెలుస్తోంది. దానికి తోడు ఎంపీ అరవింద్ సైతం ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజాసింగ్ ఒక మిస్డ్ కాల్ తో పార్టీలో తిరిగి జాయిన్ అవుతారని కామెంట్ చేయడంతో మళ్లీ చర్చ ఊపందుకుంది. అయితే తాను బీజేపీలో తిరిగి చేరే ప్రసక్తే లేదని రాజా సింగ్ ప్రకటించడంతో పాటు అందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆయన ఎదురుదాడికి దిగడంతో దాదాపు ఆయన పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: తల్లి రోజాపై దారుణ ట్రోలింగ్.. తట్టుకోలేక కొడుకు..
*రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు*
తాను తిరిగి పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని ఫేక్ అంటూ తిప్పికొట్టారు. పార్టీలో ప్రస్తుతం పరిస్థితి బాగోలేదని, రాష్ట్రంలో పార్టీ అభివృద్ధిని కొంతమంది అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే మహిళా శక్తి పేరుతో కొంతమంది తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం తప్పని, తన నుంచి ఎవరికి హాని జరగదని స్పష్టం చేశారు.
అయితే గోషామహల్ నుంచి మాధవీలతకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
*రాజాసింగ్ దారెటు..?*
బీజేపీలో కరుడుకట్టిన హిందుత్వ వాదిగా పనిచేసిన రాజా సింగ్ అధ్యక్ష స్థానం ఇవ్వలేదని రాజీనామా చేసినట్లు వచ్చిన ఆరోపణలు తిప్పికొడుతూ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ రాజీనామా చేసినట్లు బహిర్గతమయ్యాడు. అయితే కరుడుకట్టిన హిందుత్వ వాది ఆయన ఈ నాయకుడు ఏ పార్టీలో చేరే అవకాశాలున్నాయనే విషయమై చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎక్కువ అవకాశము ఉన్నట్లు గతంలో రేవంత్ రెడ్డి తో ఉన్న సాన్నిహిత్యం తో పాటు, ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి పాలనపై ఆయన ప్రశంసల వర్షం కురిపించడం చూస్తుంటే ఎక్కువగా ఆయన ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.