RK Roja Son: రాజకీయాలు( politics) శృతిమించుతున్నాయి. సోషల్ మీడియా మారుతున్న తప్పుడు ప్రచారాలు అధికం అవుతున్నాయి. అయితే అన్ని పార్టీల ప్రేరేపిత సోషల్ మీడియాలు ఉన్నాయి. అన్ని పార్టీల్లో బాధితులు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు రాజకీయాల విషయానికి వస్తే ‘అందరూ అందరే’ అనే మాట ప్రధానంగా వినిపిస్తోంది. అయితే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న చాలామంది నేతలు దూకుడుగా ఉంటున్నారు. పురుష పదజాలాలతో వివాదాలు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కుటుంబాలను సైతం పావులుగా వాడుకుంటున్నారు. చివరకు నేతల కుటుంబ సభ్యులను సైతం అసభ్యంగా చూపి ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రధాన పార్టీల్లోని కీలక నేతలు కూడా బాధితులుగా మిగులుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. పిల్లలు తీవ్ర ఆవేదనతో ఉన్నారని.. దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రోజా వ్యవహార శైలి, వాడే భాష విషయంలో కొన్ని రకాల అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే ఆమె విషయంలో ఎటువంటి సానుభూతి రావడం లేదు. కానీ ఆమె కుమారుడు మాత్రం అటువంటి ట్రోల్స్ వద్దని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేయడం విశేషం.
Also Read: గెలుపు తనదని ఇంగ్లాండ్ అనుకుంది.. అదే మ్యాచ్ ను ఇండియా వైపు తిప్పింది!
* దూకుడుతోనే గుర్తింపు..
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు ఆర్కే రోజా( RK Roja). ఆమె భర్త సెల్వామణి కూడా దర్శకుడే. అయితే రాజకీయంగా దూకుడుతోనే రోజా అంటూ బయట ప్రపంచానికి తెలిసింది. రాజకీయంగా కూడా ఆమెకు గుర్తింపు లభించింది. అయితే ఈ క్రమంలో ఆమె వాడిన భాష, వ్యవహార శైలి మాత్రం అభ్యంతరకరంగా ఉంది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యల పుణ్యమా అని.. ఇద్దరు పిల్లలు ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఒకవైపు రాజకీయ ప్రేరేపిత ప్రచారం ఉంది. మరోవైపు రోజా వ్యవహార శైలికి వ్యతిరేకంగా మారిన వారు సైతం టార్గెట్ చేయడం ప్రారంభించారు. అంటే ఆమె దూకుడు రాజకీయంగా కలిసి వచ్చింది. మంత్రి స్థాయి వరకు తీసుకెళ్లింది. కానీ ఆమె వ్యాఖ్యలు మాత్రం కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లో పెట్టింది.
* చదువుపై ఫోకస్..
రోజా కుమారుడు పదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టాడు. 20 సంవత్సరాలు దాటిన తర్వాత సినిమాల్లో అడుగు పెట్టాలన్నది ఆ కుర్రాడి ప్లాన్. అయితే మాజీ మంత్రి రోజాతో పాటు ఇద్దరు పిల్లలను కలిపి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు రోజా కుమారుడు. ట్రోల్స్ కు తాను బాధితుడునని.. తన తల్లితో కలిసి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయాల్లో ఎటువంటి వాటికి తావు ఇవ్వకూడదని అభిప్రాయపడ్డాడు. ఇటువంటివి ఏ పార్టీ వారు చేసినా తప్పేనని తేల్చి చెప్పాడు. సినిమా రంగంతో పాటు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తన తల్లి రోజా విషయంలో అసభ్యంగా ట్రోల్స్ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. ఏదైనా రాజకీయంగా కోపం ఉంటే వారిపై ప్రయోగించాలి కానీ.. కుటుంబ సభ్యులపై ఆ ప్రతాపం చూపకూడదని కోరాడు. ప్రస్తుతం రోజా కుమారుడు ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.