CM Revanth Reddy Comments On Vice President: ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు తమ పార్టీలో ఏం జరుగుతుందో చూసుకోకుండా వేరే పార్టీలో విషయాలపై ఎక్కువ స్పందించడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ పార్టీ నావ మునుగుతుందో, తేలుతుందో చూసుకోకుండా వేరే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కనిపిస్తోంది. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న పార్టీని ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేయకుండా వేరే పార్టీ వ్యవహారాల్లో తల దూర్చి భంగపాటు పడుతున్నారు. అలాంటి నాయకులను ఈ మధ్య చాలామందిని చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్న నాయకుల్లో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుంది.
Also Read: తల్లి రోజాపై దారుణ ట్రోలింగ్.. తట్టుకోలేక కొడుకు..
ప్రస్తుతం ఒక ముఖ్యమైన చర్చ ఈ మధ్యన కొనసాగుతోంది. భారత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడం, కొత్త వారిని ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదల కావడం చకచక జరిగిపోయింది. ఈ సందర్భంగా బిజెపికి అత్యధిక మెజార్టీ స్థానాలు ఉండడంతో పాటు, ఆ పార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ ఉంది గనుక బిజెపి ప్రతిపాదించిన అభ్యర్థి మాత్రమే ఉపరాష్ట్ర పదవిని అధిష్టించే అవకాశం ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ పదవి కోసం పోటీ పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ప్రతిపాదన చేయడం, బిజెపి సంసారంలో చిచ్చుపెట్టడానికి ప్రయత్నించడం, ఏదోవిధంగా పార్టీలో అలజడి సృష్టించి, ఎలాగోలా ఇరుక్కున్న పెట్టాలని ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది. ఉప రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ, లేదా మిత్రపక్షాలు చెందిన వారిని ప్రతిపాదించడం, పోటీలో ఉండడం ఒక పద్దతి. కాకుండా ఈ విషయంలో ఇప్పుడిప్పుడే నిర్ణయం తీసుకొని ఏదో మాట్లాడి భంగపాటు పడ్డ దానికన్నా మౌనం వహించడం ఉత్తమమైన లక్షణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో చూసాం. ఆ పార్టీ అభ్యర్థికి ఆ పదవి ఇస్తే బాగుంటుందని, ఆ పార్టీలో ఆ నాయకుని ప్రాభవం తగ్గిందని, ఆ పార్టీ వ్యవహారాలు ఆ నాయకుడి వల్ల దెబ్బతింటున్నాయి అని మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇదీవాళ్లయితే బాగుంటారు. వీలైతే బాగుంటారని ఎదుటి పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తూ ప్రకటనలు చేయడం కొంత ఆ పార్టీని ఇబ్బంది పరిచేందుకు తప్ప వేరే విషయం కాదు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదించిన బండారు దత్తాత్రేయ ఒకరు తెలంగాణ బిజెపిలో సీనియర్ నాయకులు ఆయనను సీఎం ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించడం గౌరవ ప్రదమైన ప్రతిపాదనే అయినా ఆ పార్టీ ఈ అభ్యర్థినీ ప్రతిపాదిస్తారో వారి ఇష్టం అనే విషయం తెలుసుకోవాల్సింది.
*రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కరెక్టేనా*
రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కాంగ్రెస్ అధిష్టానం సమ్మతిస్తున్నట్లు కనిపిస్తోంది. నిర్ణయాలన్నీ పార్టీ హైకమాండ్ తీసుకుంటున్నట్లు, తాను నిమిత్త మాతృన్ని అని చెప్పుకుంటున్న సీఎం ఎంతో నేర్పుగా రాజకీయాలు నేర్పుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా, ఏం నిర్ణయం తీసుకున్నా మన మంచికే అని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రస్తుతం కనిపిస్తోంది. అధినాయకత్వానికి గట్టిగా మద్దతు పలికే బలమైన గొంతుకగా రేవంత్ పార్టీలో, అధిష్టానం దృష్టిలో ముద్ర పడిపోయారు. రాష్ట్రంలో ఒకవైపు బిఆర్ఎస్ మనుగడను దెబ్బ తీస్తూ, మరోవైపు ఎదుగుతున్న బీజేపీ ప్రాభవాన్ని నిలువరిస్తూ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ చదరంగంలో రేవంత్ ప్రధాన భూమిక పోషిస్తున్నాడు.