Telangana Elections 2023: ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు..

హెదరాబాద్‌ లోని అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.

Written By: Raj Shekar, Updated On : November 30, 2023 10:10 am
Follow us on

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఇక ఓటు వేసిన ప్రముఖులు, ప్రజలు కూడా సెల్ఫీ పాయింట్ల వద్ద ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అందరూ ఓటు వేయాలని విన్నవిస్తున్నారు.

రాజకీయ ప్రముఖులు..
పలు చోట్లు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
– హెదరాబాద్‌ లోని అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.

– శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Telangana Elections 2023

– ప్రముఖ క్రికెటర్, జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్, అతని కుమారుడు అసదుద్దీన్‌తో కలిసి ఓటు వేశారు.

Telangana Elections 2023

– నల్లగండ్ల గ్రామంలోని బూత్‌ నంబర్‌ 33లో శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్ధి వి.జగదీశ్వర్‌ గౌడ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Telangana Elections 2023

– హుస్నాబాద్‌ లో హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

– మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాల టౌన్‌లోని కార్మెనల్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ లో క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు.

– ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Telangana Elections 2023

– మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లలో ఓటు వేసి అందరూ ఓటు వేయాలని కోరారు. పట్టణ యువత ఓటు వేయాలని సూచించారు. కవిత వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు.

– వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటుహక్కు వినియోగించుకున్నారు.