https://oktelugu.com/

MLC Kavitha: కవితను టార్గెట్ చేసిన కాంగ్రెస్… ఈసీకి ఫిర్యాదు

బీఆర్ఎస్ తరఫున కవిత పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభల్లో ఆమె పాల్గొన్నారు. గురువారం ఆమె బంజారాహిల్స్ లోని డి ఏవి స్కూల్ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 30, 2023 9:57 am
    MLC Kavitha

    MLC Kavitha

    Follow us on

    MLC Kavitha: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. చెదురు మదురు ఘటనలు మినహా సజావుగా ముందుకు సాగుతోంది. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, కీలక నాయకులు సైతం ఓటు వేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడే కేంద్ర బలగాలు మోహరించాయి. ఈసీ డేగ కన్ను వేసి ఉంది.ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

    బీఆర్ఎస్ తరఫున కవిత పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభల్లో ఆమె పాల్గొన్నారు. గురువారం ఆమె బంజారాహిల్స్ లోని డి ఏవి స్కూల్ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 2018 మాదిరిగానే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇది ముమ్మాటికి కోడ్ ఉల్లంగఘనేనని.. తక్షణం కవితపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కు కాంగ్రెస్ కోరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ దృష్టికి ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ తీసుకెళ్లారు.

    అయితే ఈ ఎన్నికల్లో కెసిఆర్ దూకుడుకు ఎక్కడికక్కడే ఎలక్షన్ కమిషన్ కళ్లెం వేయడం విశేషం. ఇప్పటికే రైతు బంధు పథకాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసిఆర్ సైతం ఈసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కవిత పై సైతం కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.అయితే కవిత ఓటర్లనుప్రభావితం చేయలేదని.. మీడియాతో యాదృచ్ఛికంగానే మాట్లాడారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.