Allu Arjun : అల్లు అర్జున్ మరోసారి విచారణకు హాజరవుతున్నారు. తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ కి BNS 35 (3) సెక్షన్ క్రింద నోటీసులు జారీ చేశారు. విచారణలో భాగంగా నేడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళతారు. చిక్కడపల్లి సీఐ, ఏసీపీ అల్లు అర్జున్ ని విచారించినున్నారని సమాచారం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై ఆరోపణలు చేశారు. అనంతరం అల్లు అర్జున్ మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. తప్పుడు ఆరోపణలతో తన వ్యక్తిత్వాన్ని, గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆవేదన చెందారు.
బయట పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియగానే థియేటర్ నుండి వెళ్లిపోయినట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. మహిళ మృతి దురదృష్టకరం. చికిత్స పొందుతున్న శ్రీతేజ్ నా కుమారుడితో సమానం. అతడు కోలుకోవాలని కోరుకుంటున్నాను. లీగల్ ఇష్యూస్ కారణంగా ఆసుపత్రికి వెళ్లలేకపోయానని చెప్పారు. కాగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ కి కూడా పోలీసులు వివరణ కోరే అవకాశం ఉందట.
కీలకమైన 10 ప్రశ్నలు అల్లు అర్జున్ కోసం సిద్ధం చేశారట. కాగా అల్లు అర్జున్ ని నేడు సంధ్య థియేటర్ వద్దకు పోలీసులు తీసుకెళ్లనున్నారట. సీన్ ఆఫ్ అఫెన్సు లో భాగంగా అల్లు అర్జున్ అక్కడకు వెళ్లాల్సి ఉందట. అల్లు అర్జున్ విచారణ నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు ఈ పరిణామాలను గమనిస్తున్నారు.
మరోవైపు ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ ని ఇరికించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదంలో మరణించిన మహిళ మృతికి పూర్తిగా అల్లు అర్జున్ ని బాధ్యుడిని చేయడం సరికాదని అభిమానులు వాపోతున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఒకరోజు రాత్రి జైలు జీవితం గడిపాడు. హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
కాగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ సభ్యులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. జేఏసీ ముసుగులో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారనే వాదన ఉంది. మొత్తంగా అల్లు అర్జున్ పై తెలంగాణా గవర్నమెంట్ కత్తి కట్టినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
Web Title: Police to take allu arjun to sandhya theater as part of scene of offense
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com