Social Media Posts: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. ఏం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో వస్తోంది. దీంతో దీని ప్రభావం ప్రజలపై పడుతోంది. తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. జరగని విషయాలను సైతం జరిగినట్లుగా పోస్టులు పెడుతూ తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో నష్టం కూడా అదే స్థాయిలో జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా పట్టించుకుంటోంది. ఇలాంటి పోస్టులపై స్పందిస్తున్నారు.
ఆకతాయిలపై కొరఢా
అనవసరంగా ప్రజలను ప్రేరేపించి ఆగ్రహం కలిగేలా చేయడంలో కొందరు ఆకతాయిలు దృష్టి పెడుతున్నారు. ఫలితంగా ఎవరో పెట్టిన పోస్టులకు స్పందించి వీరు కూడా స్పందిస్తున్నారు. దీంతో కొంత మంది ఓ గ్రూపుగా ఏర్పడి విద్వేషాలు సృష్టించాలని మత కల్లోలాలు రెచ్చగొట్టేందుకు కారణంగా మారుతుంది. ఇలా మతవిద్వేషాలు సృష్టిస్తున్నారు.
ఇలాంటి వారిపై..
ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం చూస్తోంది. ఇందులో భాగంగా తప్పుడు పోస్టులు పెట్టే వారి భరతం పట్టాలని భావిస్తోంది. అలాంటి వారిని గర్తించి వారి వీపు సాఫ్ చేస్తోంది. సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ పేరుతో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు దీంతో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠినంగా ఉండాలని నిర్ణయించారు.
13 మందిపై కేసు
ఇప్పటికే వివాదాస్పద విద్వేషాలు రెచ్చగొడుతున్న దాదాపు 13 మందిపై పీడీ యక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. గత ఏడాది అభ్యంతరకరంగా ఉన్న 1,16,431 పోస్టులపై ఫోకస్ పెట్టారు. అవి కూడా వివాదాస్పదంగా ఉన్నట్లయితే వారిని కూడా జైలుకు పంపాలని నిర్ణయించారు. దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి ఆకతాయిలపై ప్రస్తుతం అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడిస్తున్నారు.