Homeటాప్ స్టోరీస్Jayashankar Bhupalapally Poisonous Water: వీడు ఉపాధ్యాయుడు కాదు కర్కోటకుడు.. ఎంత పాపానికి ఒడికట్టాడంటే..

Jayashankar Bhupalapally Poisonous Water: వీడు ఉపాధ్యాయుడు కాదు కర్కోటకుడు.. ఎంత పాపానికి ఒడికట్టాడంటే..

Jayashankar Bhupalapally Poisonous Water: తల్లిదండ్రుల తర్వాత ఈ సమాజం ఆ స్థాయిలో గౌరవం ఇచ్చేది ఉపాధ్యాయులకు. ఉపాధ్యాయులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. సరైన దారిలో నడుపుతారు. విద్యార్థులను అత్యున్నతమైన పౌరులుగా తీర్చి దిద్దుతారు. అయితే ఈ ఉపాధ్యాయుడు మాత్రం తన వృత్తికి కళంకం తీసుకొచ్చాడు. తనొక ఉపాధ్యాయుడనే విషయాన్ని మర్చిపోయి.. కర్కశంగా ప్రవర్తించాడు. తన పగ కోసం.. ప్రతి కారం కోసం నిర్దయగా వ్యవహరించాడు.

Also Read: ఎల్బ్రస్‌ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇటీవల 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్టీల్ ట్యాంక్ లో ఉన్న నీరు తాగినప్పటికీ విద్యార్థులు అలా కావడం పట్ల అధికారుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సంఘటన మీడియాలో ప్రముఖంగా రావడంతో పోలీసులు కూడా ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించారు. ఏకంగా కలెక్టర్ స్థాయి అధికారి విచారణకు రావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ స్కూల్లో ఐదు నుంచి 8వ తరగతి వరకు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. గడిచిన శుక్రవారం ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 11 మంది విద్యార్థులు స్టీల్ ట్యాంక్ లో ఉన్న నీరు తాగి ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. దీంతో ఆ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులను జిల్లా హెడ్ క్వార్టర్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

స్టీల్ ట్యాంక్ శుభ్రంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు ఎందుకు వాంతులు చేసుకున్నారో అర్థం కాలేదు. దీంతో కలెక్టర్ స్థాయి అధికారి విచారణకు రావడంతో విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆ స్టీల్ ట్యాంకు లో కలుపు నివారణ మందు కలిపినట్టు తెలుస్తోంది. ఆ మందుకి సంబంధించిన సీసా కూడా విద్యార్థుల గదిలో దొరికింది. సదరు ఉపాధ్యాయుడికి, ప్రత్యేక అధికారికి గొడవ జరుగుతున్నది. ఇటీవల కాలంలో ఆ ఉపాధ్యాయుడు సదరు ప్రత్యేక అధికారిని ఇరికించాలని ప్రయత్నించాడు. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో చివరికి ఈ పని చేశాడు.. అంతేకాదు తలుపు నివారణ మందును తాగు నీటిలో కలిపిన ఆ పాధ్యాయుడు.. ఆ మందును విద్యార్థుల దుప్పట్లపై కూడా చల్లడం విశేషం.. ఇక ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తరచుగా గొడవలు జరుగుతున్నాయి. వారంతా కూడా విద్యార్థులను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ విద్యార్థులు ఉండే వసతిగృహానికి చేరుకున్నారు. ఉపాధ్యాయుడు రాజేందర్.. మరో ఇద్దరు ఉపాధ్యాయులు వేణు, సూర్య కిరణ్.. వంట చేసే రాజేశ్వరిని విధుల నుంచి తొలగించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version