PM Modi Tour In Telangana: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ‘మహాజన్ సంపర్క్ అభిమాన్’లో భాగంగా ఆయన ఈ నెలాఖరునే తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల మోదీ పర్యటన వచ్చేనెల 12 నాటికి వాయిదా పడిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. జూలై 12న హన్మకొండ జిల్లా కాజిపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ల పీరియాడిక్ ఓ వర్ హాలింగ్ (పీఓహెచ్)కు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత వరంగల్ లో సభ ఉంటుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
దక్షిణాదిలో తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అధికారంలో ఉన్న కర్ణాటక కోల్పోయిన తరువాత బీజేపీ నేతలు మిగతా రాష్ట్రాల్లో కంటే తెలంగాణపై దృష్టి సారించారు. గతంలో కంటే ఇక్కడ బీజేపీ పుంచుకోవడంతో పాటు అధికార బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఇప్పటి వరకు చాలా సార్లు పర్యటించారు. మోదీ తో పాటు అమిత్ షా, జేపీ నడ్డాలు పదే పదే పర్యటించడం ఆసక్తిని నెలకొల్పోతోంది.
మరికొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ నాయకులు అగ్ర నాయకులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలోని కేంద్ర నుంచి వచ్చే నిధులను, కేంద్రం చేయాల్సిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతున్నారు. బీజేపీ అగ్రనేతలు సైతం తెలంగాణ పర్యటననుకాదనలేకపోతున్నారు.
ఇక రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పై బీజేపీ పోరాడుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తుండడంతో ఆ అపవాదు పోగొట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. ఇదే తరుణంలో తెలంగాణలో పర్యటించి బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బీజేపీ అగ్రనేతల పర్యటనతో కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందని భావిస్తున్నారు.