Traffic Restrictions In Hyderabad: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లింలు గురువారం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ రూట్లను మరల్చారు. నగరంలోని ప్రజలు, హైదరాబాద్ కు వచ్చే వారు ట్రాఫిక్ ఆంక్షలను తెలుసుకోవాలని పోలీసులు తెలుపుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటాయని, దీంతో ప్రయాణికలు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవాలని తెలిపారు. హైదరాబాద్ లోని ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
నగరంలోని కిషన్ బాగ్, కామాటిపురా, పురాణాఫూల్ నుంచి ఈద్గా కు వచ్చే వారు బహదూర్ పురా ఎక్స్ రోడ్ మీదుగా వెళ్లాలి. ఇక్కడికి వచ్చే వారు జూ పార్క్, మసీద్ అల్హా హో అక్బర్ ఎదురుగా పార్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈద్గా వైపునకు ప్రార్థనలు చేసేవారికే అనుమతి ఉంటుంది. ఇతరులకు అనుమతి లేదు.
శివరాంపల్లి, ధనమ్మ హైట్స్ వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే వారు ధనమ్మ హైట్స్ రోడ్డు నుంచి వెళ్లాల్సి ఉంటుంది.బహదూర్ పురా వైపు వెళ్లే వాహనాలను పురానా పూల్ దర్వాజ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. శంషాబాద్, రాజేంద్రనగర్ వైపు నుంచి బహదూర్ పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్ జంక్షన్ వద్ద నుంచి మళ్లిస్తారు. కాల్ పత్తర్ ఈద్గాకు వచ్చే వారు తమ వాహనాలను కాలా పత్తర్ ఠాణా వైపు నుంచి అనుమతి ఇస్తారు.
మసీదుల్లో ప్రార్థనలు చేసేవారికి మాత్రమే ఈ రూట్లలో వాహనాలను అనుమతి ఇస్తారు. మిగతా వారికి అనుమతి ఉండదు. అందువల్ల ఇతరులు ఇటువైపు వచ్చేవారు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చేవారు సైతం ట్రాఫిక్ ఆంక్షలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.