Peddapalli : ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి తల్లిదండ్రుల సహకారంతోపాటు గురువుల ప్రోత్సాహం ఎంతో అవసరం. కానీ దురదృష్టవశాత్తు కొందరికి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు లేకపోవడంతో వారి జీవితం అగమ్య గోచరంగా మారి దారి చూపేవారు ఎవరు ఉండరు. కానీ ప్రస్తుత కాలంలో ఆపదల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. వీరిలో సాధారణ వ్యక్తులు మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారులు కూడా ఉంటున్నారు. ఇలాగే ఓ అనాథ బాలికకు ఓ జిల్లా కలెక్టర్ దగ్గర ఉండి ఆమెకు వివాహం జరిపించారు. అలాగే టీఎన్జీవో తరపున ఆ బాలికకు ఆర్థిక సాయం అందించారు. తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత తనకు ఎవరూ లేరన్న ఆ బాలికకు ఇప్పుడు అధికారులే పెళ్లి పెద్దగా వ్యవహరించారు. అసలేం జరిగిందంటే?
Also Read : పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తికి ఎంత పెన్షన్ వస్తుంది? సౌకర్యాలు ఏంటి?
పెద్దపల్లి జిల్లాకు చెందిన నక్క మానస ఆమె చెల్లెలు లక్ష్మీ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో వారిని రామగుండంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు చేరదీశారు. ఆశ్రమ నిర్వాహకుల సహాయంతోనే వారు చదువును పూర్తి చేసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన మానస కు పెళ్లి చేయాలని ఆశ్రమ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ క్రమంలో జనగామ జిల్లాకు చెందిన రాజేష్ తో వివాహం కుదిరింది.
అయితే తల్లిదండ్రులు లేని మానసకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అండగా ఉంటానని ముందుకు వచ్చారు. కలెక్టర్ ఆమెకు పెళ్లి పెద్దగా ఉంటానని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన పెళ్లిలో కలెక్టర్ పెళ్లికి సంబంధించిన అన్ని సామాగ్రిని సమర్పించారు. అంతేకాకుండా పెళ్లి పూర్తయ్యే వరకు వారు అక్కడే ఉన్నారు. కలెక్టర్ పేరిటే పెళ్లి పత్రికలను ముద్రించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఖర్చులను టీఎన్జీవో నాయకులు భరించారు. ఇలా మొత్తానికి తనకు ఎవరూ లేరు అనుకున్నా మానసకు అధికారులు అండగా ఉంటూ పెళ్లి మీ వైభవంగా నిర్వహించారు.
ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు లేక పోతే తమ జీవితం వ్యర్థమని అనుకున్న సమయంలో కొందరు అధికారులు ఇలా అండగా ఉంటూ ముందుకు రావడం అందరిని ఆకర్షిస్తుంది. తన తల్లిదండ్రులు లేకపోవడంతో తమ జీవితం ఎంతో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మానసతో పాటు ఆమె చెల్లెలు భావించారు. కానీ ఆశ్రమం నిర్వాహకులు వారిని చేరదీసి పెంచి పెద్ద చేశారు. ప్రస్తుతం మానస డిగ్రీ పూర్తి చేసింది. ఆమె చెల్లెలు ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ లోకి వెళ్ళింది. ఇలా ప్రతి ఒక్కరూ ఎవరూ లేని వారికి సాయం చేయడం వల్ల వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు.
చాలామంది యువతలు తమ పెళ్లి ఘనంగా జరగాలని కోరుకుంటారు. కానీ ఎవరూ లేని సమయంలో వారికి అండగా ఉండేందుకు ముందుకు రావడం హర్షనీయమని అంటున్నారు. అందులోనూ కలెక్టర్ స్థాయి ఉన్న అధికారులు పెళ్లి పెద్దగా ఉండడం పై ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.